HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Naidu Kupam Visit Swarna Kupam Vision 2029

CM Chandrababu : నేడు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఈ పర్యటనలో ఆయన కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మూడ్రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా, కుప్పం రూపురేఖలను మార్చేందుకు రూపొందించిన 'స్వర్ణ కుప్పం' పథకానికి సంబంధించిన కార్యక్రమం ఈ పర్యటనలో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.

  • Author : Kavya Krishna Date : 06-01-2025 - 10:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu
Cm Chandrababu

CM Chandrababu : ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మూడ్రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా, కుప్పం రూపురేఖలను మార్చేందుకు రూపొందించిన ‘స్వర్ణ కుప్పం’ పథకానికి సంబంధించిన కార్యక్రమం ఈ పర్యటనలో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.

‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకంలో వచ్చే ఐదేళ్లలో కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం సరికొత్త ప్రణాళికలు రూపొందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Border Gavaskar Trophy: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో టీమిండియా ఓట‌మికి కార‌ణాలు ఇవేనా?

పర్యటనలో భాగంగా, సోమవారం కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ డాక్యుమెంట్‌ను సీఎం విడుదల చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా, కుప్పంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రెండు కొత్త డైరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారికంగా ప్రకటించారు.

అలాగే, కుప్పం నియోజకవర్గంలో రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ‘స్వర్ణ కుప్పం’ పథకంలో భాగంగా సోమవారం నడిమూరు గ్రామంలో గృహాలపై సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

ఇంకా, సీగలపల్లెలో ‘ఆర్గానిక్ కుప్పం’ కార్యక్రమం కింద ప్రకృతి సేద్యం రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ పర్యటన అనంతరం, జనవరి 8వ తేదీ నాడు సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్టణానికి వెళ్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Golden Globes 2025 : గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో పాయల్‌కు నిరాశ.. ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ వెనుకంజ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu naidu
  • dairy projects
  • development
  • kuppam
  • organic farming
  • political visit
  • solar pilot project
  • Swarna Kuppam
  • Vision 2029

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd