Population Control Vs Chandrababu : ఎక్కువ మంది పిల్లల్ని కనడం తప్పేం కాదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మనదేశంలోనూ వృద్ధుల జనాభా(Population Control Vs Chandrababu) పెరుగుతున్నందున ఆ సమస్యను అధిగమించేందుకు.. కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలి’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
- Author : Pasha
Date : 15-01-2025 - 8:39 IST
Published By : Hashtagu Telugu Desk
Population Control Vs Chandrababu : జనాభా నియంత్రణ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కన్నా తప్పేం కాదన్నారు. చాలా ప్రపంచదేశాలు ఇప్పటికే అంశాన్ని గుర్తించాయన్నారు. ‘‘జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా దేశాలు ఈ అంశాన్ని గుర్తించాయి. అక్కడ వృద్ధుల జనాభా బాగా పెరిగిపోయింది. అందుకే అక్కడి ప్రభుత్వాలు సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి’’ అని అని చంద్రబాబు తెలిపారు.
Also Read :Indian Army Day: నేడు ఇండియన్ ఆర్మీ డే.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?
‘‘మనదేశంలోనూ వృద్ధుల జనాభా(Population Control Vs Chandrababu) పెరుగుతున్నందున ఆ సమస్యను అధిగమించేందుకు.. కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలి’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘‘వివిధ దేశాల్లో ప్రస్తుతం నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. ఆ దేశాలన్నీ నిపుణులైన భారతీయులకు స్వాగతం పలుకుతున్నాయి’’ అని ఆయన చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Also Read :Steve Jobs Wife : ప్రయాగ్‌రాజ్‌లో స్టీవ్ జాబ్స్ సతీమణి.. స్వల్ప అస్వస్థత.. కారణం అదే
‘‘కొన్ని సంవత్సరాల క్రితం మన దేశం కూడా వృద్ధుల జనాభా పెరగడంతో సమస్యలను ఎదుర్కొంది. ఇకపై ఆ సమస్య రాకూడదు అంటే ఇప్పుడే మేల్కొనాలి. సరైన జనాభా విధానాలను అమలు చేయాలి. తద్వారా 2047 నాటికి భారతదేశం గొప్ప డెమొగ్రఫిక్ డివిడెండ్‌లను పొందుతుంది’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘గతంలో ఎక్కువ మంది పిల్లలున్న నేతలను మనం గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా డిబార్ చేసేవాళ్లం. రానున్న రోజుల్లో తక్కువ మంది పిల్లలున్న నేతలపై అలాంటి ఆంక్షలు విధించే పరిస్థితి వస్తుందేమో’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. సంతానం సంఖ్యను పెంచాలని తమిళనాడు ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు.