CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
- By Kavya Krishna Published Date - 06:22 PM, Thu - 9 January 25

CM Chandrababu : వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సందర్భంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే.. ఈ ఘటనలో 6గురు మృతి చెందారు. అయితే.. ఈ నేపథ్యంలో ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించారు సీం చంద్రబాబు. అయితే.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు. అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ దివ్యక్షేత్రం పవిత్రత కాపాడేందుకు ప్రయత్నిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని, కొన్ని సూచనలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నా సూచనలను బోర్డులో చర్చించి అమలు చేస్తారని ఆయన వెల్లడించారు. మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తే మంచిది కాదని చంద్రబాబు అన్నారు.
Congress MP: కేటీఆర్ నువ్వు చేసిన ఘనకార్యాలకు తగిన గుర్తింపునిస్తారు: కాంగ్రెస్ ఎంపీ
తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలులేదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. తిరుపతిలో దేవుడికి సేవ చేస్తున్నామనే భావనతోనే పని చేయాలని, వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని దర్శించాలని భక్తులంతా కోరుకుంటారన్నారు. తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయమని, తిరుమలలో క్యూలైన్లలో ఉంటే భక్తులు దైవ చింతనలోనే ఉంటారన్నారు. వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు పెంచారు, ఎందుకు పెంచారో తెలియదన్నారు. మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలు మార్చడం మంచిది కాదని ఆయన అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలని ఆయన హితవు పలికారు. ఏ ఆలయంలోనూ అపచారం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వెంకటేశ్వరస్వామి అంటే భక్తి రోజురోజుకూ పెరుగుతోందని, పవిత్ర దినాల్లో స్వామిని దర్శించుకోవాలన్న భావన పెరుగుతోందన్నారు. పవిత్ర దినాల్లో దర్శనాలు సాఫీగా చేయించాల్సిన బాధ్యత అధికారులదన్నారు చంద్రబాబు. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున టీటీడీ ద్వారా ఆర్థికసాయం అందిస్తామని పేర్కొన్నారు. ఆరుగురు మృతుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తామని, తీవ్రంగా గాయాలైన ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామన్నారు. అంతేకాకుండా.. ఆరోగ్యం మెరుగయ్యే వరకు వైద్య ఖర్చులు భరిస్తామని, గాయాలైన 33 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. ఆ 15 మంది పాత్ర ఏంటి? కుట్ర ఉందా?