Harish Rao : సాగర్ నీటిని ఏపీకి తరలించడంపై చర్యలు తీసుకోవాలి
Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్న నీటిపై చర్యలు తీసుకోవడంపై రేవంత్ రెడ్డి నిద్రిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 3 నెలలుగా రోజూ సుమారు రెండు టీఎంసీ నీరు ఏపీకి చేరుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
- By Kavya Krishna Published Date - 01:56 PM, Thu - 20 February 25

Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాగార్జున సాగర్ నుంచి గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌కు కుడి కాలువ ద్వారా రోజూ సుమారు 10,000 క్యూసెక్కుల నీరు తరలించబడుతున్నదని ఆయన ఆరోపించారు. అయితే.. ఇందులో ప్రతి రోజూ సుమారు రెండు టీఎంసీల నీరు ఏపీకి చేరుతున్నదని తెలిపారు హరీష్ రావు. ఈ నీటి తరలింపును ఆపేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోకపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. సాగర్ నుంచి ఏపీకి నీరు తరలించడం పై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చలు జరిగాయని, అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టమైన విజ్ఞప్తి చేయడంలో వెనక్కి తగ్గుతున్నదని విమర్శలు చేయడమేమీ లేదని ఆయన అన్నారు.
నాగార్జున సాగర్ వద్ద మోహరించిన CRPF బలగాలను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ తీర్మానించింది, కానీ వాటిని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరే ధైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు హరీష్ రావు. అంతేకాకుండా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కూడా ఈ అంశంపై మాట్లాడే ధైర్యం లేదని హరీష్ రావు అన్నారు. “మా మీద ఎగరాలంటే జానెడు జానెడు ముఖ్యమంత్రి ఎగురుతారని” అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో ఉన్న భూములకు నీళ్లు అందేలా త్వరగా చర్యలు చేపట్టాలని హరీష్ రావు పిలుపు ఇచ్చారు.
ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగంపై ఏటా కేఆర్ఎంబీ త్రీమెన్‌కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని, కానీ, ఈ ఏడాది ఇప్పటివరకు త్రీమెన్‌కమిటీ మీటింగ్ పెట్టలేదని ఆయన అన్నారు. బోర్డు పనితీరు ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని హరీష్ రావు విమర్శించారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకునేందుకు బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో ఘోరంగా విఫలమైందని హరీష్ రావు మండిపడ్డారు.
World Day of Social Justice : ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి..?