Virat Kohli: ఆ విషయంపై తొలిసారి మౌనం వీడిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే సీజన్-18 మధ్యలో కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్ నుండి ప్రమోషన్, పెయిడ్ పార్టనర్‌షిప్, విజ్ఞాపనల వంటి పోస్ట్‌లను తొలగించాడు.
- By Gopichand Published Date - 12:45 PM, Wed - 16 April 25

Virat Kohli: ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే సీజన్-18 మధ్యలో కోహ్లీ (Virat Kohli) తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్ నుండి ప్రమోషన్, పెయిడ్ పార్టనర్‌షిప్, విజ్ఞాపనల వంటి పోస్ట్‌లను తొలగించాడు. ఇది ఈ రోజుల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు. కోహ్లీ ఇలాంటి పోస్ట్‌లను తొలగించడానికి ఎందుకు నిర్ణయించాడు? ఈ విషయంపై ఇప్పుడు విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించాడు.
పోస్ట్‌లను తొలగించడంపై విరాట్ వెల్లడి
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే కోహ్లీకి 271 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కోహ్లీ ద్వారా తమ కంపెనీ లేదా బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలనుకుంటారు. కోహ్లీ దీన్ని చేస్తున్నాడు కూడా. దీని కారణంగా అతని ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞాపనల పోస్ట్‌లు చాలా ఉండేవి. వీటిని ఇప్పుడు విరాట్ తొలగించాడు.
ఆర్‌సీబీ యూట్యూబ్ ఛానెల్‌లో విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ ఒకటి వెలుగులోకి వచ్చింది, ఇందులో కోహ్లీ ఇలా చెప్పాడు. “నేను సోషల్ మీడియాతో చాలా ఆసక్తికరమైన స్థితిలో ఉన్నాను. ప్రస్తుతం నేను చాలా ఎక్కువగా కనెక్ట్ అవ్వగల స్థితిలో లేను. భవిష్యత్తు ఏమి తీసుకొస్తుందో ఎవరికీ తెలియదు. కానీ, ఖచ్చితంగా దీన్ని రీసెట్ చేయాల్సిన అవసరం ఉంది.” అని పేర్కొన్నాడు.
𝐂𝐨𝐬𝐦𝐢𝐜 𝐙𝐞𝐧 𝐟𝐭. 𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 𝐚𝐧𝐝 𝐌𝐫. 𝐍𝐚𝐠𝐬 ✌😇
The most awaited interview of the #IPL season is here! Mr. Nags tries to decode Virat Kohli’s meditative state of mind in this special episode of @bigbasket_com presents RCB Insider. 🤪 pic.twitter.com/S63OwmFxAe
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2025
విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో 271 మిలియన్ ఫాలోవర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులలో ఒకడు. ఈ భారీ ఫ్యాన్ బేస్ కారణంగా అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్రాండ్ ప్రమోషన్లు, పెయిడ్ పార్టనర్‌షిప్‌లు, విజ్ఞాపనలకు ప్రధాన వేదికగా ఉండేది. అనేక గ్లోబల్, భారతీయ బ్రాండ్‌లు కోహ్లీ సోషల్ మీడియా స్టార్‌డమ్‌ను ఉపయోగించి తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసేవి కూడా.
Also Read: Bhubharathi : రేవంత్ తీసుకొచ్చిన భూ భారతి.. రైతులకు లాభమా..? నష్టమా..?
ఐపీఎల్ 2025లో దుమ్మురేపుతున్న కోహ్లీ
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోహ్లీ 6 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో బ్యాటింగ్ చేస్తూ 143.35 స్ట్రైక్ రేట్‌తో 248 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్ధ శతకం కూడా ఉంది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు.