Social Media
-
#Andhra Pradesh
Social Media: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. 15 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు
ఏలూరులో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. కొడుకు ప్రవర్తనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా ఆ బాలుడు మొబైల్‌కు బానిసగా మారాడు. చదువును పక్కన పెట్టి సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రిళ్లు గేమ్స్ ఆడుతూ, పగటిపూట నిద్రపోతున్నాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. అది ఏలూరులోని పోలీస్ స్టేషన్.. భార్యాభర్తలు అక్కడికి వచ్చి పోలీసులను సంప్రదించారు. […]
Date : 10-06-2026 - 11:33 IST -
#Andhra Pradesh
Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం Nandu’ s world సంచలనం
Nandu’s World Nandana నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన భార్యాభర్తలపై కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. యూకే వీసా పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఈ జంట టార్గెట్‌గా పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలపై నందూస్ వరల్డ్ నందన స్పందించారు.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ‘నందూస్ వరల్డ్’ (Nandus World) పేరుతో యూకేలో ఉంటున్న భార్యాభర్తలు నందన, మధు […]
Date : 02-06-2026 - 12:55 IST -
#World
Cockroach Party: బొద్దింకల పార్టీ.. పాక్‌లో కాక్రోచ్ అవామీ పార్టీల ఆవిర్భావం
భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిజిటల్ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్‌కూ పాకింది. అక్కడ కూడా ‘కాక్రోచ్ అవామీ పార్టీ’, ‘కాక్రోచ్ అవామీ లీగ్’ వంటి కొత్త గ్రూపులు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. నిరుద్యోగ యువత వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ ట్రెండ్ ఇరు దేశాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. పాక్‌లో ప్రధాన రాజకీయ పార్టీలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ, నవాజ్ షరీఫ్ పీఎంఎల్-ఎన్, పీపీపీలకు ప్రత్యామ్నాయంగా ఈ ‘కాక్రోచ్ పార్టీలు’ రంగంలోకి దిగుతున్నాయి. […]
Date : 22-05-2026 - 2:21 IST -
#Cinema
Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోదీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. […]
Date : 11-05-2026 - 2:08 IST -
#India
Bengal Politics: అసలు తగ్గేదేలే అంటున్న మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ శాసనసభను గవర్నర్ ఆర్.ఎన్. రవి రద్దు చేయడంతో మమతా బెనర్జీ అధికారికంగా ‘మాజీ ముఖ్యమంత్రి’ అయ్యారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ప్రకటన వెలువడింది. అసెంబ్లీ రద్దుతో ఆమె నేతృత్వంలోని కేబినెట్ కూడా రద్దయింది. అయితే, అధికారికంగా పదవి కోల్పోయినప్పటికీ, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్‌లలో మాత్రం ఇప్పటికీ ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి’గానే తనను తాను పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం […]
Date : 08-05-2026 - 12:12 IST -
#Cinema
Ashu Reddy: అషు రెడ్డి కేసులో.. హైకోర్టు కీలక ఆదేశాలు
సినీ నటి అషురెడ్డి చుట్టూ గత కొద్దిరోజులుగా నెలకొన్న వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమెకు పెద్ద ఊరటనిచ్చింది. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో తనపై వస్తున్న కథనాలపై ఆమె న్యాయపోరాటం చేస్తూ, చివరకు కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులను సాధించారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్ర ఫిర్యాదుతో సీసీఎస్‌లో నమోదైన కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో తన పరువుకు భంగం కలిగించేలా, తన వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన వార్తలను […]
Date : 01-05-2026 - 12:50 IST -
#Telangana
డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..
Hyderabad Minor Girl ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలింది. ఇన్‌స్టా వేదికగా డబ్బున్న అమ్మాయిలతో పరిచయం […]
Date : 20-04-2026 - 11:47 IST -
#Andhra Pradesh
హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై రేగిన దుమారం చల్లారకముందే, సోషల్ మీడియా వేదికగా మరో కొత్త వివాదం రాజుకుంది. సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్‌క్రీమ్‌ను విక్రయిస్తోందంటూ జరుగుతున్న ప్రచారమే దీనికి కారణం. ఈ అంశం ప్రస్తుతం ఏపీలోని అధికార, విపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వైసీపీ వర్గాల ఆరోపణలు నిన్నటి వరకు దేవుడి ప్రసాదం పేరుతో రాజకీయాలు.. నేడు […]
Date : 15-04-2026 - 10:59 IST -
#Cinema
Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్
వివాదాస్పద నటి పూనమ్ పాండే మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. తాను గర్భవతి అని ప్రకటిస్తూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. టీ-షర్ట్‌ను పైకి మడిచి బేబీ బంప్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనికి క్యాప్షన్‌గా ‘గర్భవతి’ అని పాలసీసా ఎమోజీలను జోడించారు. View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) క్యాన్సర్ డ్రామా తర్వాత.. ఇప్పుడు […]
Date : 31-03-2026 - 2:09 IST -
#Cinema
Anna Konidela: మెగా బ్రదర్స్ పై పవన్ భార్య ఎమోషనల్ కామెంట్స్!
Anna Lezhneva ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల (లెజినోవా) సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఆమె, తన పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులతో తనకున్న అనుబంధం గురించి ఆమె చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మెగా కుటుంబంలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా అన్నా తన అనుభవాలను పంచుకున్నారు. “వచ్చిన కొత్తలో ఎవరిని ఏమని పిలవాలో నాకు తెలియలేదు. నా […]
Date : 26-03-2026 - 2:53 IST -
#Andhra Pradesh
Narasimha Rao Garikapati: గరికపాటి గుడ్డు మాటలు మరోసారి వివాదంలో ..!!
Narasimha Rao Garikapati తన వాగ్ధాటితో కోట్లాది మందిని అలరించే గరికపాటి నరసింహారావు, మరోసారి తన మాటలతో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన విమర్శించిన తీరు అమానవీయంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలను “శోభనపు పెళ్ళికొడుకులతో” పోల్చడం అగ్నికి ఆజ్యం పోసింది. తాజా వివాదం వివరాల్లోకి వెళితే… పిల్లలకు పుస్తకాలు, బట్టలు, భోజనం అన్నీ ఉచితంగా ఇస్తుంటే వారికి చదువుపై శ్రద్ధ ఉండదని, అన్నీ […]
Date : 21-03-2026 - 2:00 IST -
#Sports
కిరాణా షాప్ లో వరల్డ్ కప్ హీరో వరుణ్ చక్రవర్తి
Varun Chakravarthy టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన వరుణ్ చక్రవర్తి, తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మైదానంలో తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, పతకంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఉన్న ఒక చిన్న కిరాణా కొట్టులో ఆయన […]
Date : 13-03-2026 - 11:56 IST -
#South
పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా
Monalisa మహాకుంభ్ మేళాలో తీయించుకున్న ఫొటోలతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా తన చిరకాల ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడారు. వీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో, వివాహం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించి కేరళలోని ఒక ఆలయాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ జంటకు ప్రాణహాని ఉందన్న సమాచారంతో కేరళ పోలీసులు వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించారు. ఆలయ ప్రాంగణంలో పోలీసులు పహారా కాస్తుండగా హిందూ సంప్రదాయం ప్రకారం […]
Date : 12-03-2026 - 10:50 IST -
#Cinema
మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌చాక్‌తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే, ఇప్పుడు ఆయన నటించిన ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ‘ఫీమేల్ ఓజీ’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. View this post […]
Date : 11-03-2026 - 9:51 IST -
#Andhra Pradesh
వెబ్‌సిరీస్‌లో ఛాన్స్ పేరిట యువతితో అసభ్య వీడియోలు
Kakinada Girl సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి, యూసుఫ్‌గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ […]
Date : 07-03-2026 - 2:54 IST