HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Report Ipl 2026 Opener Pushed Back Date For Final Decided

ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

ఇంతకుముందు వచ్చిన నివేదికల ప్రకారం.. ఐపీఎల్ రాబోయే సీజన్ మార్చి 28 నుండి ప్రారంభమై, మే 31న ఫైనల్ మ్యాచ్ జరగవచ్చని భావిస్తున్నారు. అయితే అంతకుముందు మార్చి 26 నుండి మే 30 వరకు ఉండవచ్చని వార్తలు వచ్చాయి.

  • Author : Gopi Date : 10-03-2026 - 8:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2026
IPL 2026

IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌కు సంబంధించి చర్చలు ఊపందుకున్నాయి. టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరిగిన రోజున (ఆదివారం, మార్చి 8) క్లోజింగ్ సెర్మనీకి ముందు లీగ్ రాబోయే సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేస్తారని మొదట భావించారు. కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా షెడ్యూల్ గురించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చారు. షెడ్యూల్ విడుదలయ్యే తేదీని, అందులోని ఒక కీలకమైన మార్పును ఆయన వెల్లడించారు.

12 మార్చి నాటికి షెడ్యూల్ విడుదల

వార్తా సంస్థ IANSతో మాట్లాడుతూ బీసీసీఐ కార్యదర్శి మాట్లాడుతూ.. “మేము మార్చి 12 నాటికి ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం మేము మొదటి 20 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేస్తాము” అని తెలిపారు. నివేదికల ప్రకారం.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మొదటి అర్ధభాగం (ఫస్ట్ హాఫ్) షెడ్యూల్‌ను క్లియర్ చేసింది. కాబట్టి ప్రస్తుతానికి కేవలం ప్రారంభ 20 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల కానుంది.

Also Read: భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

ఎన్నికల ప్రభావం

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కావడంలో జాప్యానికి ప్రధాన కారణం ఎన్నికలు. ఈ ఏడాది (2026) పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నందున ఎన్నికల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకే షెడ్యూల్‌ను విడతలవారీగా విడుదల చేయాలని నిర్ణయించారు.

లీగ్ ఎప్పుడు ప్రారంభం కావచ్చు?

ఇంతకుముందు వచ్చిన నివేదికల ప్రకారం.. ఐపీఎల్ రాబోయే సీజన్ మార్చి 28 నుండి ప్రారంభమై, మే 31న ఫైనల్ మ్యాచ్ జరగవచ్చని భావిస్తున్నారు. అయితే అంతకుముందు మార్చి 26 నుండి మే 30 వరకు ఉండవచ్చని వార్తలు వచ్చాయి. అధికారిక షెడ్యూల్ విడుదలైన తర్వాతే అసలైన తేదీలు స్పష్టమవుతాయి. టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? షెడ్యూల్ ఎన్ని దశల్లో విడుదలవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • IPL 2026
  • IPL 2026 schedule
  • IPL Final
  • IPL News
  • sports news

Related News

Legal notices served to actor Vijay Deverakonda.

Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీజీ20 (TG20) లీగ్’ చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి తాజాగా ఈ లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్‌సీఏ టీజీ20 లీగ్‌ను నిర్వహిస్త

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd