HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >I Said Quiet Jr Ntr Loses Cool As Fans Create Chaos In Bengaluru

జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

ఆదివారం బెంగళూరులోని IMS సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • Author : Gopichand Date : 10-03-2026 - 8:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jr. NTR Loses Cool
Jr. NTR Loses Cool

Jr. NTR Loses Cool: దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ స్టార్‌గా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనను ఒక్కసారి చూడటం కోసం అభిమానులు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. అయితే ఇటీవల ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఎన్టీఆర్ అక్కడ జరిగిన గందరగోళం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కోపడ్డారు?

ఆదివారం బెంగళూరులోని IMS సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాకతో ఈవెంట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడటంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పింది.

Also Read: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

Jr NTR | மேடையில் பேசும் போது ரசிகர்கள் சொன்ன அந்த வார்த்தை.. சட்டென டென்ஷன் ஆன ஜூனியர் என்டிஆர் #jrntr | #thanthitv | #cinema pic.twitter.com/48ne2DmPtP

— Thanthi TV (@ThanthiTV) March 9, 2026

వేదికపై నుండి మందలించిన ఎన్టీఆర్

వేదికపైకి వచ్చిన ఎన్టీఆర్.. అభిమానుల రచ్చ చూసి తీవ్రంగా అసహనానికి గురయ్యారు. ఆయన ప్రసంగించడానికి ప్రయత్నిస్తున్నా ప్రేక్షకులు నిరంతరం ఆయన పేరును పిలుస్తూ కేకలు వేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ప్రసంగించడం కష్టంగా మారడంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, అక్కడి వారందరినీ శాంతంగా ఉండమని కోరారు.

ఆయన సీరియస్‌గా స్పందిస్తూ.. మొదట తెలుగులో “దయచేసి అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉంటారా?” అని అడిగారు. అయినా అభిమానులు వినకపోవడంతో కోపంగా ఇంగ్లీష్‌లో “నేను చెప్పాను కదా, నిశ్శబ్దంగా ఉండండి (I said keep quiet)” అని గట్టిగా హెచ్చరించారు. ఎన్టీఆర్ స్పందించిన తీరుతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆ తర్వాత ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపి తన ప్రసంగాన్ని కొనసాగించారు. సెలబ్రిటీల పట్ల అభిమానం ఉండటం సహజమే అయినా ఇలాంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ పాటించాలని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengaluru
  • jr ntr
  • NTR Angry
  • tollywood
  • videos
  • viral videos

Related News

Peddi New Release

పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, వాయిదా గురించిన ధృవీకరణ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

  • Actor Prakash Raj attends ED interrogation

    Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట విషాదఛాయలు

  • Srh Target

    IPL 2026 : RCB కి 202 టార్గెట్ పెట్టిన SRH

  • Suyodhana Review

    Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ!

  • Nani Kodali Nani Vv Vinay

    Jr NTR : ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది – వి వి వినాయక్

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

  • చిన్నస్వామి స్టేడియంలో దొంగల బీభత్సం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd