IPL 2025 Mega Auction: బుల్లెట్‌ను దింపుతున్న హార్దిక్.. వేలంలో ముంబై టార్గెట్ అతడే!
5-సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇప్పుడు తదుపరి సీజన్‌లో టైటిల్‌ను గెలుచుకోవడంపై దృష్టి పెట్టింది. దీని కోసం ముంబై అద్భుతమైన వ్యూహంతో వేలంలోకి ప్రవేశించబోతోంది.
- By Gopichand Published Date - 06:05 PM, Thu - 21 November 24

IPL 2025 Mega Auction: 2024 ఐపీఎల్ సీజన్ (IPL 2025 Mega Auction) ముంబై ఇండియన్స్‌ను చాలా నిరాశపరిచింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసి ఎంఐ వివాదాల్లో కూరుకుపోవడంతో ఆ ప్రభావం ప్రదర్శనపై కూడా పడింది. గతసీజన్లో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే వివాదాలు మరియు వైఫల్యాల నుండి జట్టు ఖచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకుంది. మహేల జయవర్ధనే తదుపరి సీజన్‌కు ప్రధాన కోచ్‌గా తిరిగి రాగా, రోహిత్, బుమ్రా, సూర్య, హార్దిక్ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు తిలక్ వర్మను కూడా కొనసాగించారు. నిలుపుదలలో ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పుడు కెప్టెన్సీకి సంబంధించి ఎలాంటి వివాదం లేదు.
5-సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇప్పుడు తదుపరి సీజన్‌లో టైటిల్‌ను గెలుచుకోవడంపై దృష్టి పెట్టింది. దీని కోసం ముంబై అద్భుతమైన వ్యూహంతో వేలంలోకి ప్రవేశించబోతోంది. గతంలో ముంబైకి ఆడిన స్టార్ బౌలర్‌ని వేలంలో దక్కించుకునేందుకు సిద్ధమైంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. ఈ వేలంలో ముంబై ఇండియన్స్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను లక్ష్యంగా చేసుకుంది. లెఫ్టార్మ్ బౌలర్ బౌల్ట్ తొలి ఓవర్లలో వికెట్లు తీయడంలో దిట్ట. ఏంఐ అతన్ని కొనుగోలు చేస్తే బుమ్రాతో అతని జత లీగ్‌లో అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. బుమ్రా, బోల్ట్‌లను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్టుకు అంత సులభం కాదు.
Also Read: Rohit- Kohli: రోహిత్, కోహ్లీ కోసం రంగంలోకి దిగిన అగార్కర్
ట్రెంట్ బౌల్ట్‌కు ముంబై ఇండియన్స్ కు కొత్త కాదు. 2020 మరియు 2021 రెండు సీజన్లలో ముంబై తరుపున ఆడాడు. 2 సీజన్లలో 29 మ్యాచ్‌లు ఆడి 38 వికెట్లు తీశాడు. 2020లో ఏంఐని ఛాంపియన్‌గా మార్చడంలో బోల్ట్ కీలక పాత్ర పోషించాడు. అయితే 2022కి ముందు విడుదలయ్యాడు. కానీ ఇప్పుడు ముంబై యాజమాన్యం మళ్లీ ఈ బౌలర్‌ను తమ శిబిరంలో చేర్చుకునేందుకు ఊవిళ్లూరుతోంది. 2022లో ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే 2025కి ముందే విడుదలయ్యాడు. బౌల్ట్ 3 సంవత్సరాలలో ఆర్ఆర్ తరుపున 42 మ్యాచ్‌లలో 45 వికెట్లు తీశాడు. ఇక బోల్ట్ ఐపీఎల్ కెరీర్ గురించి చెప్పాలంటే 104 మ్యాచ్‌ల్లో 121 వికెట్లు తీశాడు. బోల్ట్ పేస్, స్వింగ్, బౌన్స్ మరియు యార్కర్‌లతో ప్రత్యర్థి బ్యాటర్లను కచ్చితంగా ఇబ్బంది పెట్టగలడు. ఇప్పుడు ముంబైకి ఇదే కావాలి. సో బోల్ట్ ని ముంబై కాస్త డబ్బు వెచ్చించి అయినా దక్కించుకోవాలని చూస్తుంది.