HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Interesting Update On Nagarjunas 100th Movie

నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • Author : Vamsi Chowdary Korata Date : 12-03-2026 - 10:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagarjuna's 100th Film
Nagarjuna's 100th Film
King 100  టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమాను సైలెంట్‌గా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా దర్శకుడు కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

నాగార్జునను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు కార్తీక్ తెలిపారు. గతంలో నాగార్జున కెరీర్‌లో కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిన శివ‌, ర‌క్ష‌కుడు వంటి చిత్రాల్లో కనిపించిన పవర్‌ఫుల్, స్టైలిష్ అవతారంలో ఆయన మరోసారి దర్శనమివ్వనున్నారని స్పష్టం చేశారు. అలాగే కథానుసారం ఈ సినిమాలో నాగార్జున ఏకంగా మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని చెప్పడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం నాగార్జున ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని, ఆయన లుక్ అభిమానులకు పండగలా ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు.

అయితే, ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమాకు ఓ స్టార్ డైరెక్టర్‌ను కాకుండా, అనుభవం తక్కువ ఉన్న తమిళ దర్శకుడిని ఎంచుకోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాను కూడా నాగార్జునను అడిగానని కార్తీక్ వెల్లడించారు. “నాగార్జున గారితో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఎదురుచూస్తుంటారు. మంచి కథలతో వస్తుంటారు. అలాంటిది ఈ అవకాశం నాకు ఎలా ఇచ్చారని అడిగాను. దానికి ఆయన ‘కథ నచ్చితే చాలు.. నేను గత 40 ఏళ్లుగా కొత్త దర్శకులతో పనిచేస్తున్నాను’ అని సింపుల్‌గా సమాధానమిచ్చారు” అని కార్తీక్ వివరించారు.

గతంలో కూడా నాగార్జున మ‌ణిర‌త్నం (గీతాంజ‌లి), ప్రియ‌ద‌ర్శ‌న్ వంటి ఇతర భాషల దర్శకులతో పనిచేసి బ్లాక్‌బస్టర్లు అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక, ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. వారిలో సీనియర్ నటి ట‌బు ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, ‘నాట్యం’ ఫేమ్ సుస్మిత భ‌ట్ మరో కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఈ తాజా అప్‌డేట్స్‌తో ‘కింగ్ 100’పై అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor nagarjuna
  • akkineni nagarjuna
  • Director Ra Karthik
  • King 100 movie
  • Nagarjuna 100th Movie
  • Susmita Bhatt
  • Tabu
  • Telugu Cinema
  • tollywood

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

    Latest News

    • Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!

    • Vastu And Money: వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలో తెలుసా..?

    • Indriya – Aditya Birla Jewellery : భారతీయ సంస్కృతి అద్దంపట్టేలా ‘ఇంద్రియ’ అద్భుత ఆవిష్కరణ

    • Amazon : అమెజాన్‌లో జోరుగా టూ-వీలర్ సేల్స్!

    • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం

    Trending News

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd