Rohit- Kohli: రోహిత్, కోహ్లీ కోసం రంగంలోకి దిగిన అగార్కర్
పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో భారత జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇక్కడ కూడా టీమిండియా కేవలం 1 టెస్టులో మాత్రమే విజయం సాధించింది. 2008 జనవరిలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
- By Gopichand Published Date - 06:00 PM, Thu - 21 November 24

Rohit- Kohli: పెర్త్ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు భారత జట్టు సన్నద్ధమవుతోంది. నెట్స్‌లో భారత ఆటగాళ్లు (Rohit- Kohli) చెమటోడుస్తున్నారు. అయితే పెర్త్ టెస్టుకు ముందు భారత జట్టుకు ఓటమి భయం పట్టుకుంది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో టీమిండియాకు బ్యాడ్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ మైదానంలో భారత జట్టు కేవలం 1 టెస్టు మాత్రమే ఆడింది. 2018 డిసెంబర్లో జరిగిన ఈ టెస్టులో టిమ్ పైన్ సారథ్యంలోని ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. విరాట్ తొలి ఇన్నింగ్స్‌లో 257 బంతుల్లో 123 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 40 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేశాడు.
పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో భారత జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇక్కడ కూడా టీమిండియా కేవలం 1 టెస్టులో మాత్రమే విజయం సాధించింది. 2008 జనవరిలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ చారిత్రాత్మక విజయం క్రెడిట్ ఇర్ఫాన్ పఠాన్‌కే చెందుతుంది. అతని అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా పఠాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పఠాన్ బ్యాట్ మరియు బంతితో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లు పడగొట్టి రెండు ఇన్నింగ్స్‌లలో 74 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్‌లో ఇటీవల న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో విఫలమైన సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఎలా ఆడుతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌ను టీమిండియాతో ఆస్ట్రేలియాలోనే ఉండాలని ఆదేశించింది. అయితే అగార్కర్ టూర్ సంచలనంగా మారింది. సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ భవిష్యత్తుపై చర్చించేందుకు అగార్కర్‌ను ఆసీస్ కు పంపినట్లు సమాచారం అందుతుంది. అంతేకాదు సీనియర్లతో మాట్లాడి ఇంకా ఎంతకాలం ఆడతారనేది తెలుసుకుంటాడట. కాగా వన్డే ప్రపంచకప్ 2027లో జరగనుంది. అప్పటివరకు సీనియర్లు ఉంటారా? లేదా తప్పుకొని కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తారా అనేది చూడాలి.