HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Naidu As The Head Of The Family In Kadapalle

కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 12-03-2026 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Naidu
Chandrababu Naidu

Ap Cm Chandrababu Naidu  టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సాధికార సారథుల్ని నియమించిన సంగతి తెలిసిందే. 2023లో చంద్రబాబు వీరిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తలా కుటుంబ సాధికార సారథి బాధ్యతల్ని తీసుకున్నారు. ఆయన పేరును కుటుంబ సాధికార సారథిగా.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేశారు. ఆయనకు మొత్తం 60 కుటుంబాల బాధ్యతల్ని అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీ కుటుంబ సాధికార సారథుల పేరుతో సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిగా పార్టీ కార్యకర్తల్ని నియమించారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి వ్యవస్థను నియమించారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా కుటుంబ సాధికార సారథిగా నమోదయ్యింది. చంద్రబాబు పేరును చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేయడం విశేషం. కడపల్లె పంచాయతీలో చంద్రబాబు కూడా సాధారణ కార్యకర్తలా టీడీపీ కుటుంబ సాధికార సారథిగా బాధ్యతల్లో ఉన్నారన్నమాట.

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని కడపల్లె పరిధి శివపురంలో నివాసాన్ని నిర్మించుకుని గృహప్రవేశం కూడా చేశారు. ఈ క్రమంలో చంద్రబాబును కూడా కడపల్లె పంచాయతీలో టీడీపీ తరఫున ప్రతినిధిగా కుటుంబ సాధికార సారథి బాధ్యతలను నిర్వర్తించనున్నారు. చంద్రబాబుకు తిమ్మరాజు పల్లె పోలింగ్ బూత్ నంబర్ 49లోని 181 నుంచి 240 వరకు ఉన్న 60మంది ఓటర్లకు కుటుంబ సాధికార సారథి వ్యవహరిస్తారు. అక్కడి ఓటర్లను కలిసి కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, ఎలా లబ్ధి పొందారు, పెండింగ్‌ సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు చంద్రబాబు కుటుంబ సాధికార సారథిగా ఇప్పటికే ఓటర్లను ఒకసారి కలిశారు. గతేడాది జూలై 2న తిమ్మరాజుపల్లెలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అభిప్రాయాలను సేకరించారు.

ముఖ్యమంత్రిగా బిజీగా ఉండే చంద్రబాబుకు కూడా పార్టీలో సాధారణ కార్యకర్త నిర్వహించే బాధ్యతల్ని అప్పగించడం విశేషం. గతేడాది నెల రోజుల పాటూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ కుటుంబ సాధికార సారథుల నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుల వరకు అందరూ ప్రజల్ని కలిశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుని మై టీడీపీ యాప్ ద్వారా పార్టీకి వివరాలు తెలియజేశారు. అయితే చంద్రబాబుకు కూడా కుటుంబ సాధికార సారథి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • Kadapalle Panchayat
  • kuppam
  • Sadhikara Saaradhi
  • telugudesam party

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 629 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల వారీగా విభజించిన ఈ ఖాళీలలో.. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) లో అత్యధికంగా 200 పోస్టులు ఉన్నాయి. వీటి

  • Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

    Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

  • Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

    AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd