Andhra Pradesh
-
AP: అన్నదాత సుఖీభవ’ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ఆగస్ట్ 2న రాష్ట్రం అంతటా “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. అదే రోజు కేంద్రం కూడా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే రూ.6వేలు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14వేలు జతచేసి, మొత్తం రూ.20వేలు వార్షికంగా రైతులకు అందించనున్నది.
Date : 31-07-2025 - 6:32 IST -
Balakrishna: పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కిన నటసింహం
ఈ సందర్భంగా, తెలుగు దేశం పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తున్న పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బాలకృష్ణ చెప్పారు.
Date : 31-07-2025 - 5:51 IST -
Jagan : మేమూ హత్యా రాజకీయాలు ప్రారంభిస్తే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతికుంటాయా? – జగన్
Jagan : "రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజం. అవతలి వాళ్లు ఏ భాష వాడితే.. సమాధానం కూడా అలాంటి భాషలోనే వస్తుంది. ఆ రోజు ప్రసన్న అన్న ఇంట్లో ఉంటే.. ఆయన్ను చంపేసే వాళ్లు కాదా? మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను పంపి.. హత్యలు చేసే కార్యక్రమం చేపడితే రాష్ట్రంలో రాజ్యాంగం, లా అండ్ ఆర్డర్ బతికుంటాయా?" అని ప్రశ్నించారు.
Date : 31-07-2025 - 4:34 IST -
Nitin Gadkari: ఏపీలో వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్న నితిన్ గడ్కరీ
Nitin Gadkari: ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వినతులు అందుకున్న గడ్కరీ, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు
Date : 31-07-2025 - 2:16 IST -
Investment : వామ్మో ఏపీలో గూగుల్ 50 వేల కోట్ల పెట్టుబడి..యూఎస్ తర్వాత వైజాగే !!
Investment : అమెరికా తర్వాత గూగుల్ తన అతి పెద్ద డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఒక గొప్ప ముందడుగు అని చెప్పొచ్చు
Date : 31-07-2025 - 2:01 IST -
Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు షాక్: సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రద్దు
ఈ కేసులో ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో విచారణ సాగించిన జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం, ఏపీ ప్రభుత్వ వాదనలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని తుది తీర్పును వెలువరించింది.
Date : 31-07-2025 - 1:29 IST -
Prakasam District : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేయనున్నట్టు తెలిపారు. రెండు పథకాల కలిపిన మొత్తం రూ. 3,156 కోట్లను ఆగస్ట్ 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు వెల్లడించారు.
Date : 31-07-2025 - 11:55 IST -
Vijayawada : ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా పెరుగుతున్న వరద ఉధృతి.. అధికారుల హెచ్చరిక
. మొత్తం ఇన్‌ఫ్లో 2,77,784 క్యూసెక్కులు కాగా, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,60,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్‌కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. త్వరలో బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముంద
Date : 31-07-2025 - 11:07 IST -
Lokesh : సింగపూర్ పర్యటన విజయవంతం.. ఏపీకి పెట్టుబడుల పునాది వేసిన మంత్రి లోకేశ్
గతంలో ఆంధ్రప్రదేశ్‌తో అనుభవించిన చేదు అనుభూతులను మర్చిపోయేలా చేసిన లోకేశ్ ప్రయత్నాలు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం గమనార్హం. సింగపూర్ ప్రభుత్వం, కార్పొరేట్ ప్రముఖుల నుంచి వచ్చిన స్పందన ఏపీకి తిరిగి నమ్మకాన్ని తీసుకువచ్చింది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి, స్వతంత్రంగా కూడా మంత్రి లోకేశ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Date : 31-07-2025 - 10:30 IST -
APPSC: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ అవసరం లేదు!
గతంలో ఒక ఉద్యోగానికి 25,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) తప్పనిసరిగా నిర్వహించేవారు.
Date : 30-07-2025 - 9:47 IST -
CBN Singapore Tour : సక్సెస్ ఫుల్ గా సింగపూర్ పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరిన చంద్రబాబు
CBN Singapore Tour : ఈ పర్యటనలో ఆయన మొత్తం 26 కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. అభివృద్ధి, పెట్టుబడుల ఆహ్వానం, డిజిటల్ పాలన, స్మార్ట్ సిటీల రూపకల్పనపై ఈ సమావేశాలు జరిగినట్టు సమాచారం
Date : 30-07-2025 - 5:21 IST -
CM Chandrababu: పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి: సీఎం చంద్రబాబు
పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థకు చెందిన పొర్ట్ ఫొలియో డెవలప్మెంట్, కార్పోరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు.
Date : 30-07-2025 - 5:05 IST -
Chandrababu : సింగపూర్‌లో నాలుగో రోజు చంద్రబాబు పర్యటన..ఆర్ధిక, పర్యాటక రంగాల్లో కీలక సమావేశాలు
ఈ సందర్భంగా క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC), టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
Date : 30-07-2025 - 2:17 IST -
School Principal : వాడు ఉపాధ్యాయుడు కాదు కామాంధుడు
School Principal : విద్యా కేంద్రంగా గుర్తింపు పొందిన స్కూల్‌నే దుర్మార్గానికి వేదికగా మార్చిన ప్రిన్సిపాల్ షాజి జయరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు
Date : 30-07-2025 - 12:00 IST -
Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరొకరు అరెస్ట్
పోలీసులు అతడిని పలుమార్లు పిలిపించినా హాజరుకాలేదు. దీంతో అతనిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వరుణ్ లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తించారు. కేసులో ప్రధాన నిందితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A1) కు దగ్గరగా ఉన్న వరుణ్, కలెక్షన్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్నట్టు పోలీసులు ధృవీకరించారు.
Date : 30-07-2025 - 11:00 IST -
AP liquor scam : ఏపీ మద్యం కేసు.. 12 అట్టపెట్టెల్లో రూ.11 కోట్ల నగదు స్వాధీనం
మొత్తం 12 అట్ట పెట్టెల్లో దాచి ఉంచిన రూ.11 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ నగదు రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు వరుణ్ పురుషోత్తం ద్వారా జూన్ 2024లో వినయ్ సాయంతో గుట్టుచప్పుడు కాకుండా అక్కడ ఉంచినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. దీనిపై చాణక్య, వినయ్ పాత్రలపై కూడా అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Date : 30-07-2025 - 10:02 IST -
Jagan : కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్న జగన్
Jagan : రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు అక్రమంగా వేధింపులకు గురవుతున్నారని ఆరోపించిన జగన్, త్వరలో ఓ ప్రత్యేక యాప్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు
Date : 29-07-2025 - 9:13 IST -
‘LEAP’ Schools : ఏపీలో ‘లీప్’ పాఠశాలలతో విద్యలో నూతన మార్గదర్శకత్వం
'LEAP’ Schools : ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగాన్ని ఆధునీకరించే దిశగా ప్రభుత్వం వినూత్న ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పాఠశాల ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది
Date : 29-07-2025 - 9:01 IST -
AP ByPoll : ఏపీలో ఉప ఎన్నికలు.. కొన్ని ఖాళీ స్థానాలకే మాత్రమే
AP ByPoll : ఎంపీటీసీ స్థానాల్లో రామకుప్పం, కారంపూడి, విడవలూరు, జడ్పీటీసీ స్థానాల్లో పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి
Date : 29-07-2025 - 8:45 IST -
New Ration Cards : ఏపీలో కోటి 21 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు – మంత్రి మనోహర్ కీలక ప్రకటన
New Ration Cards : రాష్ట్రంలో కోటి 21 లక్షల మందికి కొత్త డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Date : 29-07-2025 - 8:29 IST