Liquor Botte: ఖాళీ మద్యం సీసాలకు క్యాష్‌బ్యాక్ – ఏపీలోనూ తీసుకురావాలా?
ఈ తరహా పథకాలను ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకురావాలని పర్యావరణ ప్రేమికులు, ప్రజలు కోరుతున్నారు.
- By Dinesh Akula Published Date - 10:58 AM, Sun - 21 September 25
 
                        అమరావతి: (Liquor Bottle Return Scheme )- తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఖాళీ మద్యం సీసాలకు క్యాష్‌బ్యాక్ పథకాలు మంచి ఫలితాలిస్తోంది. వినియోగదారులు తాగిన సీసాలను తిరిగి దుకాణాల్లో అప్పగిస్తే రూ.10 (తమిళనాడు) నుంచి రూ.20 (కేరళ) వరకు నగదు ఇచ్చే స్కీమ్‌లు అమలవుతున్నాయి. పర్యావరణ రక్షణకు తోడుగా, వీటి వల్ల గ్రామాలు, పట్టణాలు శుభ్రంగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల చిత్తూరు జిల్లాకు సరిహద్దులోని తమిళనాడు గ్రామాల్లో రోజూ 900 సీసాల మద్యం అమ్ముడవుతుండగా, వాటిలో 800 సీసాలు తిరిగి వస్తున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. కేరళలో అయితే ప్రతి సీసా కొనుగోలు సమయంలో అదనంగా రూ.20 డిపాజిట్ వసూలు చేసి, తిరిగి సీసా ఇవ్వగానే ఆ డిపాజిట్ ఇస్తున్నారు.
ఈ తరహా పథకాలను ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకురావాలని పర్యావరణ ప్రేమికులు, ప్రజలు కోరుతున్నారు. రోడ్లపై, చెరువుల వద్ద పడేసిన గాజు సీసాలు ప్రమాదకరంగా మారుతున్నాయని చెబుతున్నారు. పశువులు గాయపడుతున్నాయని రైతులు చెబుతున్నారు.
ఈ పథకం అమలు చేయాలంటే కొన్ని సవాళ్లు ఉన్నాయి. సీసాల సేకరణ, రీసైక్లింగ్‌కి సదుపాయాలు, ఖర్చును ఎవరు భరించాలి అనే అంశాల్లో స్పష్టత అవసరం. అయినప్పటికీ చిన్న ప్రోత్సాహం పెద్ద మార్పు తేవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Also Read: TTD Case: టీటిడీ పరకామణి కేసులో CID దర్యాప్తు ఆదేశం: విదేశీ కరెన్సీలు, బినామీ పత్రాలు వెలుగులోకి
 
                    



