Nara Lokesh: మంత్రితో బడిదాకా.. లోకేశ్ చొరవతో జెస్సీకి కేజీబీవీ సీటు
ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ జెస్సీ పరిస్థితిని తెలుసుకొని తక్షణమే స్పందించారు. ఆమెకు కేజీబీవీ సీటు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
- By Dinesh Akula Published Date - 06:46 PM, Sun - 21 September 25

మంత్రాలయం మండలం, కర్నూలు జిల్లా: (Nara Lokesh) కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన చిన్నారి జెస్సీ చదువు ఆపి పత్తి చేలో కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితికి చేరింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కేజీబీవీ) సీటు రాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు వలస కూలీలుగా తెలంగాణ తీసుకెళ్లారు. చదవాలన్న తపన ఉన్నా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆశలు చలిచిపోయాయి. అయితే ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లిన వెంటనే స్పందించి జెస్సీకి మళ్లీ విద్యావకాశాన్ని కల్పించారు.
జెస్సీ కుటుంబం ఒక నిరుపేద దళిత కుటుంబం. వారు సొంతంగా వ్యవసాయ భూమి లేకపోవడం, గ్రామంలో ఆరో తరగతికి పైగా పాఠశాల లేకపోవడంతో, పిల్లలను చదివించేందుకు అవకాశాలు లేకుండా పోయాయి. ఐదో తరగతి పూర్తి చేసిన జెస్సీకి చిలకలడోణలోని కేజీబీవీలో ఆరో తరగతిలో చేర్పించేందుకు దరఖాస్తు చేశారు. కానీ సీటు రాలేదు. జిల్లా అధికారులు కలిసినా ప్రయోజనం లేకపోవటంతో కుటుంబం వలస వెళ్లిపోయింది.
చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో..
కేజీబీవీలో సీటు ఇప్పించే బాధ్యత నాది..కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం నన్ను కదిలించింది. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు. అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ! కేజీబీవీలో… pic.twitter.com/ciWODBLEfJ
— Lokesh Nara (@naralokesh) September 21, 2025
ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ జెస్సీ పరిస్థితిని తెలుసుకొని తక్షణమే స్పందించారు. ఆమెకు కేజీబీవీ సీటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ‘‘పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చిన్నారుల చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. చిట్టి తల్లి నిశ్చింతగా చదువుకో, సీటు ఇప్పించేది నా బాధ్యత’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
అంతేకాదు, చదువు కోటానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పిల్లలను బడికి పంపితే వారికి ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, మధ్యాహ్న భోజనం అందిస్తామని వివరించారు. బడిలోనే భద్రత ఉంది, భవిష్యత్తు ఉంది అని చెప్పారు.
ఇంతకముందు కూడా మంత్రి లోకేశ్ ఎన్నో విద్యార్థులు, గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో చొరవ చూపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపారు. ఇప్పుడు జెస్సీ జీవితంలో విద్యకు నూతన ఆరంభం Minister లోకేశ్ ద్వారా వీలైంది.