న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్- విరాట్ గణాంకాలివే!
ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడమే కాకుండా శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయ్యర్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
- Author : Gopichand
Date : 03-01-2026 - 7:39 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma- Virat Kohli: భారత్- న్యూజిలాండ్ మధ్య జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 నుండి ప్రారంభం కానుంది. జనవరి 3న బీసీసీఐ టీమ్ ఇండియాను ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడమే కాకుండా శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయ్యర్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అందరి కళ్లు ఇప్పుడు రోహిత్, విరాట్‌లపైనే ఉన్నాయి. న్యూజిలాండ్‌పై వీరిద్దరికీ అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఆ గణాంకాలను ఒకసారి చూద్దాం.
రోహిత్ – విరాట్ గణాంకాలు ఎలా ఉన్నాయి?
రోహిత్ శర్మ
వన్డేలు: న్యూజిలాండ్‌పై 31 వన్డేల్లో 38.32 సగటుతో 1073 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టెస్టులు: 9 టెస్టు మ్యాచ్‌ల్లో 44.23 సగటుతో 575 పరుగులు సాధించారు.
టీ20లు: 17 టీ20ల్లో కివీస్ జట్టుపై ‘హిట్‌మ్యాన్’ 511 పరుగులు చేశారు.
Also Read: బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం విధించిన బీసీసీఐ.. కారణమిదేనా?
విరాట్ కోహ్లీ
వన్డేలు: న్యూజిలాండ్‌పై 33 వన్డేల్లో 55.23 అద్భుత సగటుతో 1657 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టెస్టులు: 14 టెస్టుల్లో 959 పరుగులు చేశారు. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.
టీ20లు: 10 టీ20ల్లో ‘కింగ్ కోహ్లీ’ 34.55 సగటుతో 311 పరుగులు చేశారు.
అద్భుతమైన ఫామ్‌లో ఇద్దరు ఆటగాళ్లు
ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ముంబై తరపున ఆడిన రోహిత్ శర్మ సిక్కింపై 152 పరుగులతో విరుచుకుపడ్డారు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఆంధ్రప్రదేశ్‌పై 131 పరుగులతో అదరగొట్టారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లోనూ వీరిద్దరూ పరుగుల వర్షం కురిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా స్క్వాడ్
- శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి
🚨 News 🚨
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZ pic.twitter.com/8Qp2WXPS5P
— BCCI (@BCCI) January 3, 2026