HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kuldeep Yadavs Wedding Celebrations Kohli And Rohit To Attend

కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. హాజరుకానున్న కోహ్లీ, రోహిత్!

  • Author : Vamsi Chowdary Korata Date : 13-03-2026 - 9:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kuldeep Yadav Marriage
Kuldeep Yadav Marriage
Kuldeep Yadav  టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ వేదికగా రేపు వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది.

ఈ హై-ప్రొఫైల్ వివాహం కోసం ముస్సోరీలోని చారిత్రక సావోయ్ హోటల్‌లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి కోసం హోటల్‌ను మొత్తం బుక్ చేశారు. ఈ హోటల్‌లోని 80 గదులతో పాటు సమీపంలోని ఇతర లగ్జరీ హోటళ్లలో కూడా గదులను రిజర్వ్ చేశారు. అతిథులు, కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది కోసం ఈ భారీ ఏర్పాట్లు చేసినట్లు హోటల్ యాజమాన్యం వెల్ల‌డించింది. రెండు మూడు రోజుల పాటు ఈ హోటల్ ఇతరులకు అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.

కుల్దీప్ యాదవ్, వంశికలది చాలా కాలం నాటి స్నేహబంధం. కాన్పూర్‌లో వీరి కుటుంబాలు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే నివసించేవి. కుల్దీప్ లాల్ బంగ్లా ప్రాంతానికి చెందినవాడు కాగా, వంశిక శ్యామ్ నగర్ వాసి. కుల్దీప్ అండర్-19 ఆడే రోజుల నుంచే వీరిద్దరికీ పరిచయం ఉంది. వంశిక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నారు. ఆమె మెల్‌బోర్న్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.

గతేడాది జూన్ 4న లక్నోలో వీరి నిశ్చితార్థం సంప్రదాయబద్ధంగా జరిగింది. వాస్తవానికి వీరి వివాహం నవంబర్‌లోనే జరగాల్సి ఉన్నా, దక్షిణాఫ్రికా సిరీస్‌లో కుల్దీప్ బిజీగా ఉండటంతో వాయిదా పడింది. ఇటీవల అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి టీ20 ప్రపంచకప్‌ను నిలబెట్టుకున్న భారత జట్టులో కుల్దీప్ సభ్యుడిగా ఉన్నాడు. టోర్నీలో కొన్ని మ్యాచ్‌లే ఆడినప్పటికీ, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టి తనదైన ముద్ర వేశాడు. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే కుల్దీప్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 T20 World Cup
  • cricket
  • indian cricket team
  • Jasprit Bumrah
  • kuldeep yadav
  • Kuldeep Yadav Wedding
  • Mussoorie
  • rohit sharma
  • Vamshika
  • virat kohli

Related News

Who is Team India's new T20 captain?

T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ విషయంలో బీసీసీఐ తన సహనాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. 2026లో టీ20 ప్రపంచకప్‌ను గెలిపించినప్పటికీ, కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను తప్పించి, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా తీవ్ర ఫామ్‌ సమస్యలతో ఇబ్బంది పడుతుండటమే ఈ

    Latest News

    • UWA : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీలో చదివేందుకు గోల్డెన్ ఛాన్స్

    • CEEW : జియోథర్మల్ ఎనర్జీ – ఏపీ, తెలంగాణ సహా కీలక రాష్ట్రాల్లో భారీ అవకాశాలు

    • Survival : సంపూర్ణ ఆరోగ్య పునరుద్ధరణే లక్ష్యంగా ‘రికవరీ వన్ 2026’

    • Shani Pooja: శనిదేవుని జయంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!!

    • Cool Water: కూల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

    Trending News

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd