HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ireland Sweeps The Series Shreyas Iyers Sensational Comments

Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Author : Vamsi Chowdary Korata Date : 29-06-2026 - 9:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ireland sweeps the series... Shreyas Iyer's sensational comments.
Ireland sweeps the series... Shreyas Iyer's sensational comments.

ఐర్లాండ్‌ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌ను అర్థం చేసుకోవడంలో, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగ్గా వ్యవహరించిందని అంగీకరించాడు.

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఒక పరుగు తేడాతో ఓడిన భారత్‌.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో చేజార్చుకుంది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన శ్రేయస్‌ అయ్యర్‌.. ప్రత్యర్థి ఆటతీరును ప్రశంసిస్తూ తమ జట్టు లోపాలను ప్రస్తావించాడు.

‘‘పిచ్‌ ఎలా ప్రవర్తిస్తుందో మేం సరిగా అంచనా వేయలేకపోయాం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలోనూ వెనుకబడ్డాం. సింగిల్స్‌ను డబుల్స్‌గా మార్చడంలో కూడా తేడా కనిపించింది. ఆ విషయంలో ఐర్లాండ్‌ మమ్మల్ని పూర్తిగా మించిపోయింది’’ అని అయ్యర్‌ చెప్పాడు.

ఈ సిరీస్‌ తమకు నిరాశ కలిగించిందని, అయితే ఐర్లాండ్‌ చాలా ప్రొఫెషనల్‌గా ఆడిందని అయ్యర్‌ కొనియాడాడు. పిచ్‌పై వారికి స్పష్టమైన అవగాహన ఉందని, వారి ఫీల్డింగ్‌, బౌలింగ్‌ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ప్రశంసించాడు.

టీ20 అరంగేట్రం చేసిన యువ పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌పై అయ్యర్‌ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌లో సాధించిన అనుభవాన్ని అతడు ఇక్కడ కూడా చక్కగా ఉపయోగించుకున్నాడని, అతడికి స్పష్టమైన బౌలింగ్‌ ప్రణాళికలు ఉన్నాయని తెలిపాడు. తొలి మ్యాచ్‌ ఆడిన సూర్యాంశ్‌ షెడ్గే కూడా ఈ అనుభవం నుంచి ఎంతో నేర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ ఓటమితో భారత్‌ వరుసగా 16 టీ20 ద్వైపాక్షిక సిరీస్‌ల విజయ పరంపరకు తెరపడింది. అలాగే టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు తొలి సిరీస్‌లోనే పరాజయం చవిచూశాడు. ఇక భారత్‌ జట్టు జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs IRE
  • indian cricket team
  • shreyas iyer
  • T20 Cicket

Related News

Rohit Sharma's retirement...?

Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌..? ఇంగ్లాండ్‌తో చివరి వన్డే

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్ భవితవ్యంపై తీవ్రమైన ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమవ్వడంతో ఈ చర్చ మరింత ముదిరింది. నిన్న‌ జరిగిన రెండో వన్డేలో 47 బంతుల్లో కేవలం 26 పరుగులు చేసిన తీరు,

    Latest News

    • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

    • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

    • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

    • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

    • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd