HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Twist In The Radha Gayatri Death Case

Radha Gayatri: రాధా గాయత్రి మృతి కేసులో ట్విస్ట్

  • Author : Vamsi Chowdary Korata Date : 22-06-2026 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Techie Radha Gayatri's final audio... key details come to light.
Techie Radha Gayatri's final audio... key details come to light.

విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి హిల్‌స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుమార్తె మృతిపై ఆమె తండ్రి, మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మరియు సమర్పించిన పక్కా ఆధారాలతో ముస్సోరి పోలీసులు గాయత్రి భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేశారు. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఈ దంపతులు ఇటీవల ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లగా, జూన్ 14న ముస్సోరిలోని ఒక హోటల్ గదిలో రాధా గాయత్రి శవమై కనిపించింది. మృతి చెందిన సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తం కారినట్లు గుర్తించిన పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా, తాజా దర్యాప్తులో భర్త శ్రీచరణ్ ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసి, మరణానికి కారణమయ్యే ప్రమాదకరమైన మందులను వాడించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అక్కడ హత్య కేసు నమోదు కావడంతో విశాఖపట్నంలో ఉన్న భర్త శ్రీచరణ్ అప్రమత్తమై పరారయ్యాడు.

గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ మొదటి నుంచి అబద్ధాలు చెబుతూ పోలీసులను, భార్య కుటుంబ సభ్యులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ టూర్ ప్లాన్‌కు సంబంధించి మృతురాలి తండ్రి సుధాకర్ పోలీసులకు కీలక ఆధారాలు అందజేశారు. నిందితుడు తమకు కేవలం రిషికేశ్, హరిద్వార్ యాత్రల గురించే చెప్పాడని, ముస్సోరి వెళ్తున్నట్లు గానీ, అక్కడ బస చేస్తున్నట్లు గానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాచాడని ఆయన ఆరోపించారు. తాను స్వయంగా ముస్సోరి వెళ్లి, పోలీసులు మరియు డెహ్రాడూన్ ఉన్నతాధికారులను కలిసి న్యాయం చేయాలని కోరారు. అలాగే కూతురు చనిపోయిన హోటల్ యాజమాన్యంతో మాట్లాడగా, అక్కడ ఎలాంటి మద్యం గానీ, మాదకద్రవ్యాలు గానీ సరఫరా చేయలేదని వారు స్పష్టం చేసినట్లు సుధాకర్ వెల్లడించారు.

దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవ చేసిన తన కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటని సుధాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె మృతికి కారణమైన అల్లుడిపై కఠిన చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం ఆపనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పోస్ట్‌మార్టం నివేదిక అత్యంత కీలకంగా మారనుంది. మరోవైపు, విశాఖపట్నంలోని సింహాచలంలో ఒక హోటల్ రూమ్‌లో బస చేసిన శ్రీచరణ్, తనపై ముస్సోరిలో హత్య కేసు నమోదైనట్లు తెలియడంతో అక్కడి నుంచి రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాడు. పరారైన నిందితుడి కోసం ఉత్తరాఖండ్, విశాఖపట్నం పోలీసులు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Murder case
  • Mussoorie
  • police investigation
  • radha gayatri
  • sricharan
  • uttarakhand

Related News

FDA raids Sia Goyal's father's shop; food products worth ₹8.14 lakh seized.

Siya Goyal: సియా గోయల్ తండ్రి దుకాణంలో ఎఫ్‌డిఎ సోదాలు.. రూ. 8.14 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులు స్వాధీనం.

కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్‌కు చెందిన బీజీ గోయల్ & కంపెనీ దుకాణంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ), పూణే జోన్-1 అధికారులు జూలై 14న పూణేలోని మార్కెట్ యార్డ్‌లో దాడులు నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై రూ. 8,14,630 విలువైన 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తమకు అంది

    Latest News

    • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

    • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

    • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

    • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

    • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd