HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Widespread Heavy Rains Across Telangana Districts

Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 29-06-2026 - 8:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Widespread heavy rains across Telangana districts.
Widespread heavy rains across Telangana districts.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఒక ద్రోణి.. ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా వాతావరణ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.

ఇక ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ములుగు జిల్లా ఏటూరునాగారంలో 7.3 సెం.మీ, సంగారెడ్డి జిల్లా మొగ్ధంపల్లిలో 5.7 సెం.మీ, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 5.2 సెం.మీ, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమాండ్ల సంకీసలో 5.1 సెం.మీ చొప్పున భారీ వర్షాలు నమోదయ్యాయి. నేడు కూడా భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hyderabad Rain Alert
  • IMD Rain Alert
  • rain alert
  • Rain Alert Telangana
  • Rain Alert Today
  • telangana heavy rain alert
  • Telangana Rain Alert

Related News

Alert for the people of Telangana: Heavy rains in this district.

Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భార

  • Alert for the people of Telangana: Heavy rains in this district.

    Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: ప్రజలకు చల్లటి కబురు.. నేడు ఆ జిల్లాల్లో వానలు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

Latest News

  • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

  • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

  • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

  • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd