HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bcci Announces Huge Reward For Indian Womens Team

Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

  • Author : Vamsi Chowdary Korata Date : 03-11-2025 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Victory Parade
Victory Parade

భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది.

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత మహిళా జట్టు తొలిసారి ట్రోఫీ ముద్దాడింది. దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్‌లో అద్భుత విజయంతో వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. భారత మహిళా క్రికెట్ జట్టుకు రూ. 51 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఈ నగదు బహుమతి ఇవ్వనున్నారు.

దేవజిత్ సైకియా మాట్లాడుతూ “1983లో కపిల్ దేవ్ ప్రపంచకప్ గెలిపించి భారత క్రికెట్‌లో ఒక కొత్త యుగాన్ని ప్రారంభించారు. ఈ రోజు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని మహిళల జట్టు కూడా అదే స్థాయిలో ఉత్సాహాన్ని దేశానికి అందించింది. వారు కేవలం ట్రోఫీ గెలుచుకోవడమే కాదు, కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం మహిళా క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది” అని అన్నారు.

జై షా బీసీసీఐ కార్యదర్శిగా 2019లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి మహిళా క్రికెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పురుషులు, మహిళలకు సమాన వేతన విధానంతీసుకువచ్చారు. అలాగే ఐసీసీ చైర్మన్‌గా జై షా మహిళల ప్రైజ్ మనీని 300 శాతం పెంచారు. ముందు 2.88 మిలియన్ డాలర్లు ఉన్న ప్రైజ్ మనీని 14 మిలియన్ డాలర్లకు పెంచారు. ఇవన్నీ మహిళా క్రికెట్ అభివృద్ధికి దోహదపడ్డాయి అని సైకియా అన్నారు.

ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు యంగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ అందించిన అద్భుత ఆరంభం జట్టు స్కోర్‌ను 298 పరుగులకు చేర్చింది. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ సెంచరీ చేసినప్పటికీ.. స్పిన్ మాంత్రికురాలు దీప్తి శర్మ బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించింది. సఫారీలు 246 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ తొలి వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.

టీమిండియా మహిళా జట్టు వన్డే వరల్డ్ కప్ అందుకున్న తర్వాత సంబరాలు మిన్నంటాయి. మాజీ క్రికెటర్లు జులన్ గోస్వామీ, మిథాలీ రాజ్ సైతం టీమిండియా ట్రోఫీని ముద్దాడి సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయం వెనుక ఉన్న కోచ్ అమోల్ మజుందార్‌ని అందరూ ప్రత్యేకంగా అభినందించారు. భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఈ వరల్డ్‌కప్ ఓ మైలురాయిలా మిగిలిపోనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amanjot Kaur
  • cricket news
  • Deepti Sharma
  • Harleen Deol
  • Harmanpreet Kaur
  • ICC women's world cup
  • ICC Womens World Cup 2025
  • ICC Womens World Cup india
  • Jemimah Rodrigues
  • Pratika Rawal
  • Radha Yadav
  • Renuka Singh Thakur
  • Richa Ghosh
  • Smriti Mandhana
  • Sneh Rana
  • sports news
  • Sree Charani
  • TeamIndia
  • Uma Chetry

Related News

Women's T20 World Cup: Pakistan routed by India again.

Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ చేతిలో మళ్లీ చిత్తైన పాకిస్థాన్..

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత జట్టు తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, ఆల్ రౌండర్ దీప్తి శర్

    Latest News

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd