Yashasvi Promise To Fans: గతంలో కంటే బలంగా తిరిగి వస్తాం.. జైస్వాల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
ముంబై టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత యశస్వి జైస్వాల్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ఈరోజు బాధగా ఉంది. కానీ మేము గతంలో కంటే బలంగా తిరిగి వస్తాము. మా మీద నమ్మకం ఉంచండి అని రాసుకొచ్చాడు.
- By Gopichand Published Date - 08:30 AM, Mon - 4 November 24

Yashasvi Promise To Fans: న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించడంలో న్యూజిలాండ్ విజయం సాధించింది. న్యూజిలాండ్ కంటే ముందు ఇంగ్లండ్ 2012లో ఈ ఘనత సాధించింది.
ఈ సిరీస్ భారత జట్టుకు పీడకల. ముంబై వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో భారత జట్టు 25 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ తన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఒక పోస్ట్‌ను (Yashasvi Promise To Fans) పంచుకున్నాడు. ఇది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
యశస్వి జైస్వాల్ పోస్ట్ వైరల్ అయ్యింది
ముంబై టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత యశస్వి జైస్వాల్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ఈరోజు బాధగా ఉంది. కానీ మేము గతంలో కంటే బలంగా తిరిగి వస్తాము. మా మీద నమ్మకం ఉంచండి అని రాసుకొచ్చాడు.
Today hurts. But we’ll be back, stronger than ever. Stay with us 🇮🇳#ITrustIBelieve pic.twitter.com/vYMAFEhnd2
— Yashasvi Jaiswal (@ybj_19) November 3, 2024
తన పోస్ట్ ద్వారా జైస్వాల్ రాబోయే సిరీస్‌లలో మంచి ప్రదర్శన ఇస్తానని భారత అభిమానులకు హామీ ఇచ్చాడు. ఇప్పుడు జైస్వాల్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జైస్వాల్‌పై భారత జట్టుతో పాటు అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Also Read: Ajaz Patel: టీమిండియాను వణికించిన అజాజ్ పటేల్ ఎవరో తెలుసా? ఒకప్పటి భారతీయుడే!
కివీస్‌తో సిరీస్‌లో జైస్వాల్ ప్రదర్శన..
న్యూజిలాండ్‌పై జైస్వాల్ ప్రదర్శన యావరేజ్‌గా ఉంది. ఈ సిరీస్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో 13, 35 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. రెండో మ్యాచ్‌లో 30, 77 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్‌లో జైస్వాల్ బ్యాట్ నుంచి 30, 5 పరుగులు వచ్చాయి. అయితే ఈ సిరీస్‌లో జైస్వాల్ ఎన్నో రికార్డులు కూడా సృష్టించాడు. 2024లో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.
2023లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ 14 టెస్టు మ్యాచ్‌ల్లో 56.28 సగటుతో 1407 పరుగులు చేయగా, 23 టీ20 మ్యాచ్‌ల్లో ఈ ఆటగాడు 36.15 సగటుతో 723 పరుగులు చేశాడు. రెండు డబుల్ సెంచరీలు కాకుండా టెస్టుల్లో అతని పేరిట 3 సెంచరీలు ఉన్నాయి. 1 సెంచరీ కాకుండా అతను తన పేరు మీద T-20 మ్యాచ్‌లలో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి.