India
-
Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చెందిన కొన్ని సోషల్ మీడియా పోస్టులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) వర్గాలు ఖండించాయి. తమ వైపు నుంచి అలాంటి చర్యలు గానీ, ఆదేశాలు గానీ లేవని స్పష్టం చేశాయి. ఇది కేవలం ఇన్‌స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో జరిగిన పొరపాటు వల్లే జరిగిందని వివరించాయి. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి.జోసెఫ్ వ
Date : 11-05-2026 - 9:38 IST -
CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రజల కోసం అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆయన పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்றுள்ள திரு சி. ஜோசப் விஜய் அவர
Date : 10-05-2026 - 12:41 IST -
CM Joseph Vijay: మీ విజయ్ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్
తమిళనాడులో నిజమైన లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. “యువత నాకు అండగా నిలిచింది. ఈ విజయ్ ‘మామ’ మీకు అన్నివిధాలా మంచి చేస్తాడు. మీరే నా ప్రాణం” అని ముఖ్యమంత్రి తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినని, అన్నలా, తమ్ముడిల
Date : 10-05-2026 - 11:55 IST -
Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ నటుడు విజయ్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, తన తొలి మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులు, యువతకు ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కేబినెట్‌లో పలు ఆసక్తికర ముఖాలు ఉన్నాయి. విజయ్ మంత్రివర్గంలో 29 ఏళ్ల నటి ఎస్. కీర్తనకు చోటు దక్కడం
Date : 10-05-2026 - 10:54 IST -
Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..
తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ చారిత్రక ఘట్టంతో, దాదాపు 59 సంవత్సరాల తర్వాత తమిళనాడుకు ఒక ద్రావిడేతర ము
Date : 10-05-2026 - 10:32 IST -
CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం
తమిళనాడులో కొత్త శకం మొదలవుతోంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ నేడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతోపాటు కొందరు నేతలు సైతం మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. విజయ్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మెజార్టీ మార్క్‌కు కొద్ది దూరంలో నిలవడంతో విజయ్ ఇతర చిన్న పార్టీల సాయం తీసుకున్నారు. విజయ్
Date : 10-05-2026 - 9:51 IST -
CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
తమిళనాడు రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నంబర్ 118ను సాధించింది. తాజాగా విడుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీ మద్దతు ప్రకటించడంతో విజయ్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు వీసీకే పార్టీ నుంచి టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున లేఖ అందుకున్
Date : 09-05-2026 - 4:58 IST -
CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!
టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటు విషయంలో ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు సహా చిన్న పార్టీల మద్దతు ఇచ్చాయని మూడుసార్లు గవర్నర్‌ను కలిశారు. అయితే, ఆయన ప్రభుత్వ ఏ
Date : 09-05-2026 - 4:53 IST -
Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ ఇంకా తొలగిపోలేదు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి మద్దతివ్వడానికి విద్యుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) కీలకమైన డిమాండ్లను ముందుకు తెచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో తమకు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ పట్టుబడుతున్నట్లు సమాచారం. శుక్రవారం పార్టీ అధినేత అధ్యక్షతన జరిగిన ఉన్న
Date : 09-05-2026 - 4:29 IST -
Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న
Date : 09-05-2026 - 3:03 IST -
Narendra Modi: 98 ఏళ్ల వృద్ధుడి పాదాభివందనం చేస్తున్న మోదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శించిన వినమ్రత అందరినీ ఆకట్టుకుంది. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో 98 ఏళ్ల వయసున్న బీజేపీ సీనియర్ కార్యకర్త మఖన్ లాల్ సర్కార్ పాదాలకు మోదీ నమస్కరించి, ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ భావోద్వేగ దృశ్యానికి అక్కడున్న వేలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు.
Date : 09-05-2026 - 12:36 IST -
Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక మలుపు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఏలిన బెంగాల్ గడ్డపై మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద
Date : 09-05-2026 - 11:21 IST -
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం పై సస్పెన్స్
తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్. టీవీకే అధినేత విజయ్ 118 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేశారని, దీంతో రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారని టీవీకే, వామపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని టీవీకే, వామపక్షాల నాయకులు ప్రకటించారు. కానీ విజయ్‌ని రేపు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ వర్గాలు తెల
Date : 09-05-2026 - 9:53 IST -
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతాలో శుక్రవారం జరిగిన బీజేపీ నూతన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా… బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి పేరును అధికారికంగా ప్రకటిం
Date : 08-05-2026 - 5:25 IST -
Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!
తమిళనాడులో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీకి.. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా.. తాజాగా చిన్న చిన్న పార్టీల మద్దతును కూడబెట్టడంలో విజయ్ సఫలీకృతం అయినట్లు తెలుస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక డీఎండీకేతో టీవీకే నేతల సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో టీవీకే పార్టీ మరికాసేపట్లో గవర్నర్‌ను కలిస
Date : 08-05-2026 - 4:52 IST -
DMK: పొత్తుకు గుడ్ బై చెప్పిన డీఎంకే
తమిళనాడు రాజకీయాల్లో ఒక భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే – కాంగ్రెస్ మధ్య దశాబ్దాల కాలం నాటి పొత్తు తెగిపోయేలా చేశాయి. టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే, చివరకు కాంగ్రెస్‌తో బంధాన్ని అధికారికంగా తెంచుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ల
Date : 08-05-2026 - 4:33 IST -
CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల జరిగ
Date : 08-05-2026 - 4:25 IST -
Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల జరిగ
Date : 08-05-2026 - 4:15 IST -
Tamil Nadu politics: దళపతి విజయ్‌కు భారీ షాక్..
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు తీవ్ర ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లను గెలుచుకుని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. కాంగ్రెస్ పార్టీ కలిసినప్పటికీ టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేలు (విజయ్ రెండు చోట్ల గెలిచినందువల్ల ఒక స్థానం మాత్రమే లెక్కలోకి వస్తుంది) ఉన్నారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పా
Date : 08-05-2026 - 3:52 IST -
TVK విజయ్ ఆసక్తికర ట్వీట్
నటుడు విజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తమిళనాడు ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో పాసైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇక ఫెయిలైన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. మంచి జరుగుతుంది, విజయం ఖాయం అంటూ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇది కేవలం విద్యార్థులను ఉద్దేశించి మాత్రమే కాదని.. ప్రస్తుత తమిళ రాజకీయాలకు లింక్ పెట్టి విజయ్ ట్వీట్ చేశారని
Date : 08-05-2026 - 2:58 IST