HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >A Massive Shock For Thalapathy Vijay

Tamil Nadu politics: దళపతి విజయ్‌కు భారీ షాక్..

  • Author : Vamsi Chowdary Korata Date : 08-05-2026 - 3:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Massive Shock for Thalapathy Vijay...
Massive Shock for Thalapathy Vijay...

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు తీవ్ర ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లను గెలుచుకుని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. కాంగ్రెస్ పార్టీ కలిసినప్పటికీ టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేలు (విజయ్ రెండు చోట్ల గెలిచినందువల్ల ఒక స్థానం మాత్రమే లెక్కలోకి వస్తుంది) ఉన్నారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనను కలిసిన రెండు సందర్భాలలోనూ మెజార్టీని అడిగారు.

దీంతో కాంగ్రెస్ లాంటి పార్టీలు గవర్నర్ తీరును తప్పుపడుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను పిలవాలని సూచిస్తున్నాయి. అయితే గవర్నర్‌ను కలిసి జాబితాను సమర్పించిన సమయంలో టీవీకే అధినేత విజయ్ చేసిన చిన్న పొరపాటు ప్రభుత్వం ఏర్పాటు జాప్యానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నారని చెబుతున్నారు. రాజకీయ అనుభవం లేని విజయ్ చేసిన పొరపాటు ప్రభుత్వ ఏర్పాటు అంశానికి కీలక అడ్డంకిగా మారినట్లు కనిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాని పక్షంలో గవర్నర్ ఏకైక అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వారు సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి.

మే 6వ తేదీన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసిన విజయ్, టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల జాబితాను కూడా ఆయన సమర్పించడమే విజయ్ చేసిన పొరపాటు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వాస్తవానికి, విజయ్ ముందుగా తన పార్టీ టీవీకేకు చెందిన 108 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్‌కు సమర్పించాలి. ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే శాసనసభా పక్ష నాయకుడిగా ఆయన గవర్నర్‌ను కలవాల్సి ఉండాల్సిందని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా చేర్చడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరినట్లయిందని చెబుతున్నారు.

సంకీర్ణ ప్రభుత్వానికి అనుమతి కోరితే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలను చూపించాలని అంటున్నారు. విజయ్ తొలుత టీవీకే సభ్యుల సంతకాలతో కూడిన జాబితాను అందజేసి, ఆ తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సిందని అంటున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఉండటంతో గవర్నర్‌ను సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరినట్లయిందని చెబుతున్నారు. అందుకే గవర్నర్ పూర్తి మెజారిటీతో రావాలని స్పష్టం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏకైక అతిపెద్ద పార్టీగా మాత్రమే గవర్నర్ వద్దకు వెళ్లి ఉంటే, అప్పుడు విజయ్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సులభమయ్యేదని రాజకీయ విశ్లేషకులు అమిత్ కుమార్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. విజయ్‌కి రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు.

విజయ్ వయస్సు 51. టీవీకే పార్టీ ఎమ్మెల్యేల సగటు వయస్సు 44. విజయ్ బృందంలో రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు సెంగొట్టయన్ మాత్రమే. ఆయన ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేను వీడి టీవీకేలో చేరారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరిని ఆహ్వానించాలనే విషయంపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాన్ని ఆర్టికల్ 163 గవర్నర్‌కు కల్పిస్తుందని సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 Assembly elections
  • Rajendra Vishwanath Arlekar
  • Tamil Nadu Government Formation
  • thalapathy vijay
  • TVK Party
  • TVK Party News
  • Vijay thalapathy

Related News

Raghava Lawrence clarifies stance on political entry

Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు. Do your duty sincerely, without expecting anything in return. After watching this video, please share your a

    Latest News

    • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

    • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

    • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

    • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

    • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd