India
-
Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు
అంతా ఊహించినట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశీయంగా ఇంధన ధరలను సవరించాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పెంచాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆయిల్ ఉత్పత్తి, సరఫరాపై పడ్డ ప్రభావంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రో ధరల సవరణ తప్పలేదు. అయితే, ధరల పెరుగుదల పెట్రోల్, డీజిల్‌కు మాత్రమే పరిమితం
Date : 15-05-2026 - 11:58 IST -
Pm Modi: ఇక గ్యాస్, పెట్రోల్ కష్టాలకు చెక్?
హర్మూజ్ జలసంధిలో నెలకొన్న తీవ్ర సంక్షోభం కారణంగా ఎదురవుతున్న ఇంధన సరఫరా సవాళ్లను అధిగమించేందుకు భారత ప్రభుత్వం ఒక సాహసోపేతమైన, వ్యూహాత్మక ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోస్తోంది. గల్ఫ్ దేశమైన ఒమన్ నుంచి నేరుగా గుజరాత్ తీరానికి సముద్ర గర్భం ద్వారా సహజవాయువును తరలించేందుకు ఉద్దేశించిన ‘మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్‌వాటర్ పైప్‌లైన్ (MEIDP)’ ప్రాజెక్టుపై కేంద్రం దృష్టి సారించింది.
Date : 15-05-2026 - 11:17 IST -
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు సానుకూలంగా కదిలాయి. ఉదయం 9:34 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 292.55 పాయింట్లు లాభపడి 75,691.27 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 83.70 పాయింట్లు పెరిగి 23,773.30 వద్ద ట్రేడ్ అయ్యాయి. ప్రభ
Date : 15-05-2026 - 10:57 IST -
NEET UG 2026: నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖరారు చేసింది. జూన్ 21న ఈ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఎన్టీఏ వెల్లడించింది. భారత ప్రభుత్వ ఆమోదంతోనే నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్‌ను జూన్ 21న నిర్వహించాలని నిర
Date : 15-05-2026 - 10:51 IST -
Cm Vijay: మోదీకి సీఎం విజయ్ లేఖ
తమిళనాడులోని టెక్స్‌టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, దానిని ఆదుకునేందుకు పత్తిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి విజయ్.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. పత్తి, నూలు ధరలు విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలోని టెక్స్‌టైల్ రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “తమిళనాడు, దేశంలో
Date : 15-05-2026 - 10:24 IST -
Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు ఎట్టకేలకు షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుపై రూ. 3- 3.40 వరకు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగ్గా.. ఇక్కడ చమురు కంపెనీలపై భారం పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత మే 15 న ధరల్ని పెంచుతున్నట్లు వెల్లడించాయి. CNG ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఎక్కడ ధరలు ఎలా ఉన్నాయో తెల
Date : 15-05-2026 - 9:40 IST -
Petrol price: పెట్రోల్, డీజిల్ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్ షాకింగ్ కామెంట్స్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం వల్ల పెరుగుతున్న ఇంధన ధరలు దేశ ద్రవ్యోల్బణ లక్ష్యాలకు సవాలుగా మారుతున్నాయని, దీనిపై ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకునే అవకాశ
Date : 13-05-2026 - 2:59 IST -
H-1B Visa: హెచ్–1బీ వీసాలు పై వేతనాలు..!
అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ వర్గాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విదేశీ నిపుణులకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని ఏకంగా 30 శాతం వరకు పెంచాలని యూఎస్ కార్మిక శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్) ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ న
Date : 13-05-2026 - 1:52 IST -
Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఇవాళ శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ మేరకు ఆయన సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ బలపరీక్ష, అన్నాడీఎంకేలో పెరుగుతున్న విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. విజయ్ తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస
Date : 13-05-2026 - 11:23 IST -
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. విచారణ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్‌లోని జమ్వా రామ్
Date : 13-05-2026 - 10:35 IST -
Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…
దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుంచి 15%కి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5% అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) రూపంలో ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి (95.75) పడిపోవడం, వాణిజ్య లోటు పెరగడంతో దిగుమతులను
Date : 13-05-2026 - 9:40 IST -
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్
సూపర్ 30 వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఆనంద్ కుమార్ నీట్-యూజీ 2026 పరీక్ష రద్దుపై తీవ్రంగా స్పందించారు. మన దేశంలో పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న వివాదాలను అరికట్టేందుకు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల అక్రమాలను నియంత్రించేందుకు చైనా తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం వల్ల విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతు
Date : 12-05-2026 - 5:10 IST -
Liquor Shops: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు-రాజకీయవేత్త జోసెఫ్ విజయ్, తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను (టాస్మాక్) తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రక
Date : 12-05-2026 - 9:29 IST -
Cm Vijay: స్టాలిన్ ఇంటికి CM విజయ్!
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం నాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, ఆయన నేరుగా చెన్నైలోని స్టాలిన్ నివాసానికి వెళ్లారు. తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్‌ను స్టాలిన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకు
Date : 11-05-2026 - 4:23 IST -
Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..
తమిళనాడు అసెంబ్లీలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఎంపికైన కీర్తన, సాంకేతిక కారణాల వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అసెంబ్లీలో ప్రమాణం చేసే సమయంలో తమ ‘ఎలక్షన్ సర్టిఫికెట్’ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
Date : 11-05-2026 - 3:44 IST -
CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?
తమిళ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా, ‘సూపర్‌స్టార్’గా కోట్లాది రూపాయల పారితోషికం అందుకున్న దళపతి విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నిన్న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నటుడిగా అత్యధిక పారితోషికం తీసుకున్న ఆయన, ఇప్పుడు ప్రజా సేవకుడిగా నెలకు ఎంత జీతం తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీతభత్యాల వివరాలు తమిళన
Date : 11-05-2026 - 3:15 IST -
Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్ నాటి చర్యల్ని ప్రస్తావించగా, అదే సమయంలో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సూచీలు పడిపోతున్నాయి. ఇక్కడ బంగారం కొనుగోళ్లపై మోదీ ప్రకటనతో గోల్డ్ స్టాక్స్ కుప్పకూలాయి. ఇంట్రాడేలో 12 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్లకు నష
Date : 11-05-2026 - 2:40 IST -
Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘సోమనాథ్ అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని మోదీ సోమనాథ్‌లో భారీ రో
Date : 11-05-2026 - 12:46 IST -
PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లు ఆపేయాలని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని కోరారు. అయితే, ప్రధాని మోదీ సూచనతో దేశ ప్రజలు ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను ఆపేస్తే మన ఆర్థిక వ్యవస్థకు ఎలా మేలు చేస్తుంది? ప్రస్తుతం దేశంలో విదేశీ మారక నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్ప
Date : 11-05-2026 - 11:10 IST -
Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…
ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఐదు కీలక విజ్ఞప్తులు చేశారు. బంగారం కొనుగోలు చేయొద్దని, విదేశీ ప్రయాణాలకు ఏడాది కాలం దూరంగా ఉండాలని చెప్పారు. అలాగే మెట్రో, ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టును మాత్రమే వాడాలని, సొంత వాహనాలను అనవసరంగా రోడ్డు మీదకు తేకూడదని అన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహ
Date : 11-05-2026 - 10:43 IST