HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Lovers Gold Rates Have Fallen Again

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 07-02-2026 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

Gold  బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ శుభవార్త అందింది. గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ వరుసగా దిగొస్తున్నాయి. ఇవాళ కూడా ధరలు దిగొచ్చాయి. వరుసగా రెండో రోజు రేట్లు తగ్గాయని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం మరోసారి బంగారం, వెండి ధరలు ఎగబాకాయి. ఈ ప్రభావం ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధర మళ్లీ పతనమైంది. వరుసగా రెండో రోజు రేట్లు దిగొచ్చాయి. దేశీయంగా దిగొచ్చినా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం ధరలు పెరిగాయి. దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 650 తగ్గగా తులం ప్రస్తుతం రూ. 1,40,900 వద్ద ఉంది. దీనికి ముందటి రోజు కూడా బంగారం ధర రూ. 4600 తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే ఇది ఇవాళ రూ. 710 తగ్గడంతో ప్రస్తుతం 10 గ్రాములకు హైదరాబాద్ నగరంలో రూ. 1,53,710 వద్ద ఉంది. ఇది కిందటి రోజు రూ. 5020 తగ్గింది.

బంగారం ధరలు ఆల్ టైమ్ హై చూస్తే జనవరి 29న 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,63,950 వద్ద ఉండగా.. అక్కడి నుంచి ఏకంగా రూ. 23,050 దిగొచ్చింది. 24 క్యారెట్ల పుత్తడి ధర అదే జనవరి 29న రూ. 1,78,850 వద్ద జీవన కాల గరిష్ఠాల వద్ద ఉండగా.. అక్కడి నుంచి రూ. 25,140 తగ్గడంతో ప్రస్తుతం రూ. 1,53,710 కు చేరింది.

బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా ఇవాళ దిగొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 20 వేలు తగ్గగా ప్రస్తుతం కేజీకి రూ. 2.80 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా ధర దిగొచ్చింది. ముందటి రోజు రూ. 20 వేలు తగ్గగా.. దానికి ముందు రూ. 20 వేలు పెరిగింది. అంతకుముందు ఇక వరుసగా రూ. 20 వేలు, రూ. 85 వేలు, రూ. 20 వేలు ఇలా 4 రోజుల వ్యవధిలోనే రూ. 1.25 లక్షల మేర ధర తగ్గింది. ఈ క్రమంలోనే జనవరి 29న రూ. 4.25 లక్షల వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాల వద్ద ఉండగా.. అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు రూ. 1.45 లక్షలు తగ్గిందని చెప్పొచ్చు.

ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు మళ్లీ కనిష్ఠాల నుంచి భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కిందటి రోజు ఒక దశలో 4,600 డాలర్ల స్థాయిలో ఉండగా.. మళ్లీ ఇది 4,965 డాలర్ల స్థాయికి ఎగబాకింది. దాదాపు 300 డాలర్ల వరకు రాత్రికి రాత్రే పెరిగిందని చెప్పొచ్చు. శనివారం ఉదయం 10 గంటలకు ఈ ప్రభావం దేశీయంగా కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా రేట్లు భారీగానే పెరుగుతాయని అర్థం చేసుకోవాలి. ఇక సిల్వర్ రేటు ఔన్సుకు కిందటి రోజు ఉదయం ఒక దశలో 64 డాలర్ల స్థాయికి పడిపోగా.. మళ్లీ ఇప్పుడు 77.88 డాలర్ల మార్కుకు చేరింది. 20 శాతానికిపైగా పెరిగిందన్నమాట. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 90.67 వద్ద ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 gram gold price
  • 22K gold price
  • 24K gold price
  • Daily gold price
  • Delhi silver prices
  • Global Gold Prices
  • Gold and Silver Prices Down
  • Gold and Silver Prices in Telugu
  • gold market . today gold price
  • gold price
  • gold price down
  • gold price drop
  • gold rate today
  • Gold rate today Hyderabad
  • Gold- Silver Prices
  • Hyderabad Silver Prices
  • Indian gold rate today
  • MCX
  • MCX Gold
  • Mcx Share Price
  • MCX Shares Crash
  • Silver Prices
  • Silver Prices Today

Related News

Gold Price Down March 09

Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ, వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కేజీ వెండి ధర రూ. 2,90,000 వద్దే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ,

  • Gold

    ఒక్కసారిగా పెరిగిన బంగారం వెండి .. ధ‌ర‌లు చూసి పసిడి ప్రియులకు షాక్

  • Gold Shop Offers

    War Effect : రండి బాబు..రండి..డిస్కౌంట్ లో బంగారం ..క్రేజీ ఆఫర్లు ప్రకటిస్తున్న నగల షాపులు

  • Gold Rate

    Gold Price : దిగొస్తున్న పసిడి.. 4 రోజుల్లో రూ. 10 వేలు తగ్గిన బంగారం ధర

  • Today Gold Silver Prices

    భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd