HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Lovers Gold Prices Have Dropped Sharply

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-06-2026 - 11:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for gold lovers: Gold prices have dropped sharply.
Good news for gold lovers: Gold prices have dropped sharply.

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల అనగానే మన ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేంది బంగారమే. కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతే కాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి బంగారం ఒక మంచి మార్గం. అయితే, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపించాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, ఇక్కడ దిగివచ్చాయి. ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ పెరగడం, రూపాయి పడిపోవడం వంటివి కారణమయ్యాయి. అయితే, ఇటీవలే ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇవాళ బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ క్రమంలో జూన్ 16వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు దిగివచ్చాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5 డాలర్ల వరకు తగ్గింది. దీంతో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4325 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.34 శాతం మేర తగ్గింది. దీంతో ఔన్స్ వెండి ధర 69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మూడు రోజుల తర్వాత దిగివచ్చాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.160 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,51,370 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం రేటు రూ.150 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,38,750 వద్దకు తగ్గింది.

బంగారంతో పాటు వెండి రేటు సైతం ఈరోజు దిగివచ్చింది. గత మూడు రోజుల పాటు రూ.20 వేల మేర పెరిగిన తర్వాత ఇవాళ తగ్గింది. ఈరోజు రూ.5000 మేర కిలో వెండి ధర తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2,75,000 వద్దకు దిగివచ్చింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold rate
  • 24 Carat Gold Rate
  • 24 Carat Gold Rate Down
  • 24 carat gold rate today
  • 24K gold rate
  • Check Gold Rates
  • Daily gold price
  • Global Gold Prices
  • gold market . today gold price
  • gold price
  • gold sliver
  • sliver price

Related News

Good news for gold lovers: Gold prices have dropped sharply.

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు  శుభవార్త అందుతుంది. మళ్లీ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల భారీ పతనం తర్వాత తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. అరెరే పెరుగుతుంది అని కొనుగోలుదారులు అనుకునే లోపే మళ్లీ ఒక్కసారిగా దిగొస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగగా అనిశ్చితి నెలకొంది. మరోసారి ఇరాన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. రెండు దేశాల

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Good news for gold lovers: Gold and silver prices have dropped again.

    Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd