HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold Prices Drop A Great Opportunity For Buyers 2

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 17-06-2026 - 11:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold prices drop—a great opportunity for buyers.
Gold prices drop—a great opportunity for buyers.

భారత్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, గత ఏడాదిగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. యుద్ధం జరిగితే ధరలు పెరుగుతాయని భావిస్తే భారీగా తగ్గాయి, ఆ తర్వాత యుద్ధం ఆగిందని తెలిశాక మళ్లీ పెరిగాయి. అయితే, ఇప్పుడు వరుసగా దిగిరావడం గమనార్హం. అమెరికా జాబ్ డేటా, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ విలువ వంటివి ధరలు తగ్గేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రూపాయి విలువ పుంజుకోవడం సైతం ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో జూన్ 17వ తేదీ బుధవారం రోజున హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 11 డాలర్ల వరకు పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4323 డాలర్ల వద్దకు దిగివచ్చింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.10 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు క్రితం రోజు 10 గ్రాములకు రూ.160 తగ్గగా, ఈరోజు మరో రూ.270 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,51,100 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు నిన్నటి రోజున తులానికి రూ.150 తగ్గగా, ఈరోజు మరో రూ.250 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.1,38,500 వద్దకు పడిపోయింది.

దేశీయ మార్కెట్లో వెండి ధర ఇవాళ స్థిరంగా ఉంది. అయితే నిన్నటి రోజున హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.5000 మేర తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో కిలో వెండి రేటు రూ.2,75,000 వద్దకు దిగివచ్చింది. ఈరోజు అదే ధర వద్ద ట్రేడవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 22K gold rate
  • 24 Carat Gold Price
  • 24 Carat Gold Rate
  • 24K gold price
  • Check Gold Rates
  • Daily gold price
  • Global Gold Prices
  • gold market . today gold price
  • gold price
  • gold sliver
  • sliver price

Related News

Good news for gold lovers: Gold prices have dropped sharply.

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల అనగానే మన ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేంది బంగారమే. కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతే కాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి బంగారం ఒక మంచి మార్గం. అయితే, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత బంగారం ధరల్లో ఊహించని మార్పుల

  • Gold Price

    GOLD: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన పసిడి ధరలు

Latest News

  • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

  • Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

  • Reebok: రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం 

  • Isuzu Motors India: వాహనదారులకు ఇసుజు బంపర్ ఆఫర్ 

  • Pluvicto: ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం ‘ప్లువిక్టో’ అధునాతన చికిత్స విడుదల!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd