HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Southwest Monsoon Spreading Across Telangana

IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 19-06-2026 - 12:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Southwest monsoon spreading across Telangana.
Southwest monsoon spreading across Telangana.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేక, ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు, రుతుపవనాల రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రైతాంగానికి భారత వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది. మందగించిన నైరుతి రుతుపవనాలు తిరిగి తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం అయ్యాయని.. జూన్ 23వ తేదీ మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇవి ఊపందుకోనున్నాయని న్యూఢిల్లీ వాతావరణ కేంద్రం గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేసింది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రుతుపవనాల పురోగతికి పూర్తిగా అనుకూలంగా మారాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనివల్ల రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకూ రుతుపవనాలు వేగంగా విస్తరించనున్నాయని చెప్పారు. ప్రస్తుతం రుతుపవనాల ఉత్తర సరిహద్దు రేఖ హైదరాబాద్, భద్రాచలం పరిసర ప్రాంతాల్లోనే నిలిచిపోగా.. రానున్న రోజుల్లో ఈ వాతావరణ మార్పుల్లో స్పష్టమైన పురోగతి కనిపించనుంది.

జూన్ 21 నుంచి విస్తారంగా వర్షాలు.. పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. జూన్ 21వ తేదీ ఆదివారం రోజు నుంచి రాష్ట్ర వాతావరణంలో ఒక కీలకమైన మలుపు రానుంది. ప్రస్తుతం అక్కడక్కడా కురుస్తున్న చెదురుమొదురు వర్షాలు.. జూన్ 21వ తేదీ నాటికి తెలంగాణలోని పలు రీజియన్లలో ‘విస్తారమైన’ వర్షాలుగా మారనున్నాయి. ఇక జూన్ 23 నాటికి రుతుపవనాలు రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించి, గత కొన్ని వారాలుగా వేధిస్తున్న ఉక్కపోత, ఎండల తీవ్రత నుండి ప్రజలకు పూర్తిగా ఉపశమనం కలిగిస్తాయి. మరోవైపు ఈ రుతుపవనాల పునరాగమనానికి తోడుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గనున్నాయి.

జూన్ 19వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పడిపోతాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్ నెలలో తీవ్రమైన వడగాల్పులకు కారణమైన పొడి గాలులు ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గుతున్నాయి. వాటి స్థానంలో సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన చల్లటి గాలులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో.. స్థిరమైన వర్ష కాలానికి వేదిక కానుంది.

రాబోయే రోజుల్లో ఇలా ఉండబోతున్న వాతావరణం..!

జూన్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మాత్రమే మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ జూన్ 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయి, అన్ని ప్రాంతాలలో విస్తారంగా, ముమ్మరంగా వర్షాలు కురుస్తాయి. అంతేకాకుండా రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో (కొన్నిసార్లు 60 కిమీ వేగంతో) బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా జూన్ 23 నాటికి రుతుపవనాలు మరింత ముందుకు సాగుతాయని ఐఎండీ నివేదిక పేర్కొంది. ఏదేమైనా ఈ తాజా వానల ముందస్తు సమాచారం ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rains Alert
  • IMD
  • IMD Monsoon Forecast
  • southwest monsoon
  • Telangana Rains alert
  • Telangana Weather
  • Telangana Weather Report

Related News

Heavy rains in Telangana

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 38 రోజులు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన 17 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతమే నమోదైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్ సాగు పరిస్థితులపై వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వాన

  • Heavy rain warning for AP...

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Rains inundating Mumbai

    Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

  • Heavy rain warning for AP...

    Weather Report: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల

  • Heavy rains in Telangana

    Heavy Rains: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd