HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Iaf An 32 Aircraft Crashes In Assam Rescue Teams Deployed

అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

  • Author : Vamsi Chowdary Korata Date : 13-06-2026 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IAF AN-32 aircraft crashes in Assam... Rescue teams deployed!
IAF AN-32 aircraft crashes in Assam... Rescue teams deployed!

అసోంలోని జోర్హాట్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో శనివారం భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

వాయుసేనకు చెందిన ఈ కార్గో విమానం జోర్హాట్‌లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన రౌరియా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ పరిధిలోనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో పైలట్‌ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. విమానంలో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారన్న వివరాలు కూడా తెలియరాలేదు.

ఈ ఘటనపై భారత వాయుసేన స్పందించింది. సరుకుల రవాణాకు ఉపయోగించే AN-32 విమానం ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైందని వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. ఈశాన్య భారత్‌లో కీలక వాయుసేన స్థావరంగా ఉన్న జోర్హాట్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ప్రాంతీయ వైమానిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

కొన్ని నెలల క్రితం కూడా జోర్హాట్‌ ఎయిర్‌బేస్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్బీ ఆంగ్‌లాంగ్‌ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానం సాధారణ శిక్షణ సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం AN-32 ప్రమాదంపై మరిన్ని వివరాల కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aircraft Crash
  • Assam plane crash
  • Indian Air Force

Related News

    Latest News

    • Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

    • Single: అబ్బాయిలు.. సోలోగా ఉండాలనుకుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్లే!

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    • Amaravati Capital: జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్

    • Nayeem Hasan: చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్ నయీం హసన్‌పై పోలీసులు దాడి.. రచ్చ రచ్చ

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd