HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Lovers Gold Prices Have Dropped Significantly

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర

  • Author : Vamsi Chowdary Korata Date : 14-02-2026 - 3:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

Gold Price  పసిడి ప్రియులకు శుభవార్త. చాలా రోజుల తర్వాత మళ్లీ బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి. కిందటి రోజు రూ. 1000 కిపైగా తగ్గగా.. ఇప్పుడు రూ. 2 వేలకుపైగా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు పతనం అయ్యాయి. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ జువెల్లరీ స్టోర్స్‌లో బంగారం ధర గ్రాముకు ఎంత ఉందో తెలుసుకుందాం.

బంగారం, వెండి ధరలు మళ్లీ గరిష్ఠాల నుంచి ఒక్కసారిగా దిగొచ్చాయి. అమెరికాలో జనవరి ఉద్యోగ గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. ఇక్కడ అంచనాల్ని మించి గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇప్పట్లో వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించే అవకాశం ఉండదని మదుపరులు భావించారు. సాధారణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుంటే.. బంగారం ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్ డిమాండ్ పెరిగి.. బంగారం ధర తగ్గుతుంటుంది. అదే వడ్డీ రేట్లను తగ్గిస్తే.. బంగారం ధర పెరుగుతుంది. ఇప్పుడు వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలోనే ఉండగా.. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గాయి. దానికి అనుగుణంగానే దేశీయ మార్కెట్లో, రిటైల్ మార్కెట్లో కూడా ధరలు తగ్గాయి.

ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కిందటి రోజు ఒక దశలో 5,100 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇది మళ్లీ 4,900 డాలర్లకు దిగొచ్చింది. సిల్వర్ రేటు చూస్తే 85 డాలర్ల నుంచి 78 డాలర్లకు తగ్గింది. ఇదే క్రమంలో దేశీయంగా కూడా పసిడి ధరలు పతనం అయ్యాయి.

ఫిబ్రవరి 12న 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ. 110 తగ్గి హైదరాబాద్ నగరంలో 10 గ్రాములకు రూ. 14,520 కి చేరింది. అంటే తులంపై రూ. 1100 తగ్గి రూ. 1,45,200 గా ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం ధర మరింత తగ్గింది. గ్రాముపై రూ. 240 లేదా తులంపై రూ. 2400 తగ్గడంతో గ్రాము ధర రూ. 14,280 కి దిగొచ్చింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 2620 పతనంతో తులం రూ. 1,55,780 వద్ద ఉంది.

ఇప్పుడు ప్రముఖ జువెల్లరీల్లో గోల్డ్ రేట్లను చూద్దాం. లలితా జువెల్లరీలో ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ. 14,280 గా ఉంది. కిందటి రోజు ఇది రూ. 14,520 గా ఉంది. తనిష్క్‌లో చూస్తే గ్రాము పసిడి ధర రూ. 14,320 గా ఉంది. ఇదే ఖజానా, జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కళ్యాణ్ జువెల్లర్స్ ఇలా అన్నింట్లో గోల్డ్ రేటు గ్రాముకు ప్రస్తుతం రూ. 14,280 గా ఉంది. బంగారం ధరలు అన్ని చోట్లా ఒకేలా ఉండవు. ప్రాంతాల్ని బట్టి.. స్థానిక పన్ను రేట్లను బట్టి ధరల్లో తేడా ఉంటుంది. ఇంకా జువెల్లరీ కొనుగోలు చేస్తే.. ఇక్కడ మేకింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. ఇది కూడా షాపుల్ని బట్టి మారుతుంటుంది. డిజైన్లను బట్టి కూడా ఇక్కడ ఛార్జీల్లో తేడా ఉంటుంది. ఇంకా జీఎస్టీ అన్ని చోట్లా ఒకేలా ఉంటుంది. గోల్డ్ జువెల్లరీ బిల్లుపై 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. మేకింగ్ ఛార్జీలపైనా 5 శాతం జీఎస్టీ ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 24K gold price
  • Daily gold price
  • Delhi silver prices
  • Global Gold Prices
  • Gold and Silver Prices Down
  • Gold and Silver Prices in Telugu
  • gold price
  • gold price down
  • gold price drop
  • gold price fall
  • Gold price fluctuation
  • gold rate today
  • Gold rate today Hyderabad
  • Gold- Silver Prices
  • Hyderabad Silver Prices
  • Silver Prices
  • Silver Prices Today

Related News

Gold Rate Today Feb3

వారంలో భారీగా తగ్గిన పసిడి ధరలు

వారం వ్యవధిలో ఇది ఏకంగా రూ. 3,650 మేర తగ్గి, ప్రస్తుతం రూ. 1,43,550కి చేరుకుంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు పెరుగుతాయని ఆశించిన వినియోగదారులకు, ఈ వరుస పతనం పెద్ద శుభవార్తగా మారింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలకు బ్రేక్ పడటంతో,

    Latest News

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

    • ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

    • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

    Trending News

      • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

      • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

      • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

      • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

      • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd