Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….
- Author : Vamsi Chowdary Korata
Date : 17-06-2026 - 9:58 IST
Published By : Hashtagu Telugu Desk
బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ భీమినేని వరుస వివాదాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో అర్ధనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ గతంలోనే ఆమెపై సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా రూ. 399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లతో నిర్వహించిన లైవ్ సెషన్‌లో తన ‘బాడీ కౌంట్’ ఐదు (గతంలో ఐదుగురితో రిలేషన్స్) అంటూ విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తూ ఉండగా.. “నిజాయితీగా ఉన్నందుకు నేనెప్పుడూ బాధపడను, నా లైఫ్ నా ఇష్టం” అంటూ ఆమె ఇన్‌స్టా వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ విష్ణుప్రియ భీమినేని. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత పాపులర్ టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. వెండితెరపై కూడా ఒకటి రెండు సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ, బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే కెరీర్ పరంగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో.. తన బోల్డ్ ఆటిట్యూడ్, సోషల్ మీడియాలో అడల్ట్ పోస్టుల ద్వారా అంతకంటే ఎక్కువే వివాదాల్లో నిలుస్తూ తరచూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.
వరుస వివాదాలు.. పోలీస్ కేసులు
గత కొన్నాళ్లుగా విష్ణుప్రియ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా రూ. 399 వసూలు చేస్తూ యువతను పెడదోవ పట్టించేలా అభ్యంతరకరమైన కంటెంట్, అర్ధనగ్న ఫోటోలు షేర్ చేస్తోందంటూ ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పలు విద్యార్థి సంఘాలు, నెటిజన్లు ఆమె ప్రవర్తనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు తన సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌పై అసభ్యకరమైన వీడియోలు చేస్తూ, తన పరువుకు భంగం కలిగిస్తోందంటూ ‘ప్లే లైక్ ఇంకొగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానల్‌పై విష్ణుప్రియ ఎదురు కేసు పెట్టింది. అలాగే తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులు, క్యారెక్టర్ అసాసినేషన్‌పై మియాపూర్ పోలీసులను సైతం ఆశ్రయించింది.
‘బాడీ కౌంట్’ కామెంట్స్
ఈ సబ్‌స్క్రిప్షన్ వివాదం కాస్త సర్దుమణుగుతోంది అనుకునేలోపే, విష్ణుప్రియ తాజాగా మరో బాంబ్ పేల్చింది. రూ. 399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లతో రెండు రోజుల క్రితం ఆమె ప్రత్యేకంగా ఒక లైవ్ సెషన్‌లో మాట్లాడింది. ఆ సమయంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం మొహమాటం లేకుండా తన ‘బాడీ కౌంట్’ 5 అని వెల్లడించింది. అంటే గతంలో తాను ఐదుగురితో రిలేషన్‌షిప్‌లో ఉండి వారితో రొమాన్స్ చేసినట్లు బహిరంగంగా ఒప్పుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ విష్ణుప్రియ ఇలా ఓపెన్‌గా మాట్లాడటంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నెటిజన్ల ఆగ్రహం
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ శాతం మంది నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. “డబ్బుల కోసం, పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారా?” అంటూ కొందరు నిప్పులు చెరుగుతుంటే.. “సమాజంలో అమ్మాయిలకు ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి సందేశాన్ని ఇస్తాయి?” అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ ఐదుగురు ఎవరంటూ ఆరాలు తీసేవారితో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నిండిపోయాయి.
విష్ణుప్రియ కౌంటర్
సాధారణంగా ఇంత పెద్ద వివాదం నడుస్తున్నప్పుడు ఎవరైనా సైలెంట్‌గా ఉంటారు లేదా ముఖం చాటేస్తారు. కానీ విష్ణుప్రియ మాత్రం తగ్గేదే లేదంటూ సోషల్ మీడియా వేదికగా మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. “నిజాయితీగా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. సమాజం తన గురించి ఏమనుకున్నా సరే, ఏ విషయంలోనూ అబద్ధాలు చెప్పే ప్రసక్తే లేదని, తన జీవితం తన ఇష్టమనే రీతిలో క్లారిటీ ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఈ బోల్డ్ కౌంటర్ ఇప్పుడు నెటిజన్లలో మరింత చర్చకు దారితీసింది. మరి రోజురోజుకీ ముదురుతున్న ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.