HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Trump Makes A Sensational Move At The G7 Summit

G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-06-2026 - 8:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trump makes a sensational move at the G7 summit!
Trump makes a sensational move at the G7 summit!

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా జరిపిన సైనిక దాడుల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, నావికుల భద్రతను నిర్ధారించడం ప్రపంచ దేశాల సమష్టి బాధ్యత అని ఆయన గట్టిగా నొక్కిచెప్పారు.

నిన్న‌ జరిగిన జీ7 అవుట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. “ఆ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణల వల్ల మన మిత్ర దేశాలలో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా, హ‌ర్మూజ్ జలసంధి గుండా జరిగే సముద్ర వాణిజ్యానికి అంతరాయం కలగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ ఘర్షణల కారణంగా పలువురు భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు” అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాలను వాణిజ్యపరంగా కలిపే నావికుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్‌కు సంబంధించిన ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తున్నాయన్న అనుమానంతో ఇటీవల కొన్ని వాణిజ్య నౌకలపై యూఎస్ సైనిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. జూన్ 9న ఒమన్ గల్ఫ్‌లో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘సెట్టెబెల్లో’ అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఆ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 24 మంది భారతీయులే. అంతకుముందు, జూన్ 8న 24 మంది భారతీయ సిబ్బందితో ఉన్న ‘మారివెక్స్’ అనే మరో నౌకపైనా దాడి జరిగింది. అయితే అందులోని సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. జూన్ 11న 20 మంది భారతీయులతో ఉన్న ‘జల్వీర్’ నౌకను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నౌకలేవీ భారత్‌కు చెందినవి కావు, విదేశీ జెండాలతో ప్రయాణిస్తున్నాయి.

ఈ దాడులపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ అధికారిని పిలిపించి తమ ఆందోళనను తెలియజేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధ్రువీకరించారు. “మా నావికా సమాజం సంక్షేమానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. ఈ దాడులను వెంటనే ఆపాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

ప్రపంచ చమురు, వాణిజ్య రవాణాలో హ‌ర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైనది. ఇక్కడ పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల విదేశీ నౌకలపై పనిచేస్తున్న భారతీయ నావికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. జీ7 సదస్సు వేదికగా ప్రధాని మోదీ ఈ అంశాన్ని లేవనెత్తడం, సముద్ర భద్రతకు, మధ్యప్రాచ్యంలో పనిచేస్తున్న ప్రవాస భారతీయుల రక్షణకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. సదస్సు ముగింపులో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • G7 Summit
  • Indian PM Narendra Modi
  • Indian soldiers
  • US military strikes

Related News

Attack on Chabahar port after Trump's warning

US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

డొనాల్డ్ ట్రంప్, మరిన్ని దాడులు జరిగితే మరింత బలమైన ప్రతిస్పందన ఉంటుందని టెహ్రాన్‌ను హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత, గురువారం నాడు అమెరికా ఇరాన్ యొక్క వ్యూహాత్మక ఓడరేవు అయిన చబహార్‌లోని కీలక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఈ దాడులు ఆగ్నేయ ఓడరేవు నగరంలోని రెండు సముద్ర రేవులను మరియు ఒక సముద్ర ట్రాఫిక్ నియంత

  • Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

    Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd