HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Date Has Been Fixed For The Thalliki Vandanam Amount To Be Credited To Your Account

Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 16-06-2026 - 4:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The date has been fixed for the 'Thalliki Vandanam' amount to be credited to your account.
The date has been fixed for the 'Thalliki Vandanam' amount to be credited to your account.

రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ప్రధానంగా చర్చించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, జులై మూడో వారంలో పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం, తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు జులై మూడో వారంలో ‘మెగా పీటీఎం’ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపైనా చర్చించారు.

పాఠశాల విద్యపై సమీక్ష అనంతరం, ఉన్నత విద్యారంగంపై మంత్రి లోకేశ్ దృష్టి సారించారు. రాష్ట్రంలో నిర్వహించే ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్ వంటి 12 రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగకూడదని గట్టిగా ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జాతీయ స్థాయి పరీక్షలు, పొరుగు రాష్ట్రాల సెట్ల తేదీలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఖరారు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఎప్‌సెట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని, ముఖ్యంగా డిమాండ్ ఉన్న మెకానికల్, సివిల్ బ్రాంచ్‌లపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాష్ట్రానికి ప్రపంచస్థాయి విద్యాసంస్థలను తీసుకురావడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచాలని మంత్రి ఆకాంక్షించారు. థాపర్ ఇనిస్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్ బోర్న్ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు చూపుతున్న ఆసక్తిపై చర్చించారు. ముఖ్యంగా, జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని లోకేశ్ ఆదేశించారు.

ఇదే సమయంలో, రాష్ట్రంలో ఎన్‌సీసీ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక ‘ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్’ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏపీ యువతకు సైనిక శిక్షణలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె. శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఉన్నతవిద్యా కమిషనర్ నారాయణ్ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • AP Education Department
  • AP Kutami Govt
  • Education Minister Nara Lokesh
  • Thalliki Vandanam
  • Thalliki Vandanam News

Related News

CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.

Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

రాయలసీమ ప్రజల దశాబ్దాల ఉక్కు కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్‌తో కలిసి ఆయన కాంక్రీట్ వేసి పనులక

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • Date fixed for the release of 'Thalliki Vandanam' funds.

    Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

  • AP EAPCET results released

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • AP EAPCET 2026 results postponed again.

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd