HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Lovers Gold Prices Have Plummeted

GOLD: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన పసిడి ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 11-06-2026 - 10:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

బంగారం కొనుగోలుదారులకు మళ్లీ శుభవార్త అందింది. వరుసగా బంగారం ధరలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ మరోసారి రూ. 3 వేల వరకు ధర తగ్గగా.. ఇది 6 నెలల కిందటి స్థాయికి దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పతనం అవుతున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం కూడా మరో కారణం.

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడం, క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం.. ఇవి ద్రవ్యోల్బణ భయాల్ని పెంచడం వల్ల యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకుంటుండటంతో బంగారం కుప్పకూలుతోంది. అవును.. ద్రవ్యోల్బణం పెరిగితే.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గరిష్ఠ స్థాయిల్లోనే ఉంచాల్సి వస్తుంది. అంటే ప్రస్తుత తగ్గించే ధోరణికి బదులుగా ఇంకా పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇటీవల అమెరికాలో కంపెనీలు అంచనాల్ని మించి భారీ స్థాయిలో కొత్త ఉద్యోగాలు కల్పించడంతో వడ్డీ రేట్ల పెంపు తప్పదని భావిస్తున్నారు. ఇదే జరిగితే.. డాలర్‌కు డిమాండ్ మరింత పెరిగి.. బంగారం ధర పతనం అవుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

గత 2-3 రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ భీకర దాడుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో బంగారం భారీ కుదుపులకు లోనవుతోంది. గరిష్ఠ స్థాయిల నుంచి కరెక్షన్‌కు గురవుతోంది. దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర కిందటి రోజు రూ. 3950 తగ్గగా.. మళ్లీ జూన్ 11న ఉదయం 10 గంటల సమయంలో చూస్తే మరో రూ. 2950 తగ్గి 10 గ్రాములకు రూ. 1,33,500 కు చేరింది. ఇక 2 రోజుల్లో గోల్డ్ రేటు రూ. 6900 తగ్గడం గమనార్హం.

2 రోజుల్లో రూ. 7 వేలకు పైగా తగ్గిన పసిడి ధర..

ఇక 24 క్యారెట్ల పసిడి ధర ఇవాళ (గురువారం) రూ. 3,220 తగ్గడంతో తులం రేటు హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం రూ. 1,45,640 వద్ద ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 2 రోజుల వ్యవధిలో రూ. 7520 తగ్గుముఖం పట్టింది. వెండి ధర హైదరాబాద్‌లో కేజీకి రూ. 2.60 లక్షల వద్ద స్థిరంగా ఉంది.

6 నెలల కనిష్ఠానికి గోల్డ్ రేట్లు..

ఇక గోల్డ్ రేట్లు దాదాపు 6 నెలల కిందటి స్థాయికి పడిపోవడం విశేషం. అంటే గతేడాది డిసెంబర్ – ఈ ఏడాది జనవరి మధ్య దాదాపు ఇవే ధరలు ఉండేవి. అక్కడి నుంచి భారీగా పెరుగుతూ వచ్చాయి. మళ్లీ వరుసగా తగ్గుతూ అదే స్థాయికి చేరాయన్నమాట. ఇదే ఏడాది జనవరి 29న బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరగా.. అక్కడి నుంచి సుమారు రూ. 30 వేల వరకు తగ్గడం విశేషం. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.

ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పుత్తడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు కిందటి రోజు ఉదయం 4170 డాలర్ల వద్ద ఉండగా.. ఇప్పుడు అది 4070 డాలర్ల స్థాయిలో ఉంది. ఇంట్రాడేలో ఇంకా పతనమై 4030 డాలర్ల స్థాయికి కూడా చేరింది. సిల్వర్ రేటు 64 డాలర్ల దిగువన ఉంది. ఇక రూపాయి విలువ ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూ. 83.65 వద్ద కొనసాగుతోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22 Carat Gold Rate
  • 22K gold rate
  • 24 Carat Gold Rate
  • 24 carat gold rate today
  • 24K gold price
  • 24K gold price in India
  • Global Gold Prices
  • gold price

Related News

Good news for gold lovers: Gold prices have dropped sharply.

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు  శుభవార్త అందుతుంది. మళ్లీ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల భారీ పతనం తర్వాత తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. అరెరే పెరుగుతుంది అని కొనుగోలుదారులు అనుకునే లోపే మళ్లీ ఒక్కసారిగా దిగొస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగగా అనిశ్చితి నెలకొంది. మరోసారి ఇరాన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. రెండు దేశాల

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Good news for gold lovers: Gold and silver prices have dropped again.

    Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd