HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Farmers In Ap Date Fixed For Annadatha Sukhibhava Funds Release

Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 17-06-2026 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.
Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనుంది. ఏటా మూడుసార్లు నిధులను విడుదల చేస్తున్న కేంద్రం.. జూన్ 20న (శనివారం) పీఎం కిసాన్ యోజన 23వ విడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనుంది. పీఎం కిసాన్ యోజన కింద రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఏటా రూ. 6,000 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ యోజన కలిపి అమలు చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 14 వేలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. పీఎం కిసాన్ యోజన సాయం రూ. 6,000 కలిపి.. అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి రూ. 20 వేలు బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తోంది.

ఈ 20 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని మూడు విడతలుగా రైతులకు అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. రూ. 7,000, రూ. 7,000, రూ. 6,000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఒక విడత నిధులు జమ చేయగా.. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన అందించే జూన్ 20వ తేదీనే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన నిధుల విడుదల రోజే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో జూన్ 20న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు అర్హులైన రైతులు అన్నదాత సుఖీభవ పథకం సాయం కోల్పోకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం తప్పుల సవరణకు కూడా అవకాశం ఇచ్చింది. ఏవైనా తప్పుల కారణంగా అన్నదాత సుఖీభవ సాయం పొందని రైతులు.. తమ సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలను నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే భూముల వివరాలకు ఆధార్ లింక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆధార్ ఇన్-యాక్టివ్ అని వస్తుంటే సరిచేయించుకోవాలని చెప్తున్నారు. ఇక పీఎం కిసాన్ యోజన సాయం పొందడానికి ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి అని చెప్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Annadata Sukhibhava
  • Annadata Sukhibhava' funds' release
  • AP government
  • AP Kutami Govt
  • PM Kisan Funds
  • PM Kisan funds Release

Related News

AP government takes another key decision

CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

జులై 11న జరగబోయే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే ఈ రోజున, ఏపీ ప్రభుత్వం భిన్నంగా ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన మ

  • Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

    Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

  • CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.

    Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd