Trending
-
Harish Rao : కేటీఆర్ పై రేవంత్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు : హరీశ్ రావు
రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు అని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలు గణనీయంగా మారాయి, ముఖ్యంగా ఆయన చేసిన గాఢ వ్యాఖ్య కేటీఆర్ ఒక్క వ్యక్తి కాదు, అది ఒక శక్తి అన్న వాక్యం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో మారుతోంది.
Date : 17-06-2025 - 11:15 IST -
Iran-Israeli War : టెహ్రాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు అడ్వైజరీ జారీ
ఈ పరిస్థితుల్లో టెహ్రాన్ నగరంలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది. ఈ తాజా సూచనలో, టెహ్రాన్‌లో ఉన్న భారతీయ పౌరులు తక్షణమే నగరాన్ని విడిచి వెళ్ళాలని ఎంబసీ స్పష్టం చేసింది.
Date : 17-06-2025 - 10:59 IST -
Blaise Metreweli: యూకే గూఢచార సంస్థ MI6 మొదటి మహిళా చీఫ్‌గా బ్లేజ్ మెట్రెవెల్లి.. ఎవరీమె?
ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ జూన్ 15 (ఆదివారం) నాడు ప్రకటించిన విషయం ప్రకారం.. బ్లేజ్ మెట్రెవెల్లి MI6 18వ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆమె 2025, అక్టోబర్ 1 నుండి తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.
Date : 17-06-2025 - 10:51 IST -
Chandrababu : కుప్పంలో మహిళ పై దాడి ..సీఎం ఆగ్రహం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
వాదన హద్దులు దాటి, వారు శిరీషను ఒక చెట్టుకు కట్టేసి శారీరకంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఈ దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విముక్తి చేశారు.
Date : 17-06-2025 - 10:28 IST -
PM Modi : జీ7 సదస్సు..కెనడా చేరుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీ జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వచ్చినట్టు అధికారికంగా వెల్లడించబడింది. ఈ సదస్సు జూన్ 17 నుంచి 18 వరకు కననాస్కిస్‌లో జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఏడు ప్రధాన దేశాల సమాహారమైన జీ7 సదస్సులో మోడీ వరుసగా ఆరోసారి పాల్గొనుతున్నారు. ఈసారి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై భారత ప్రధాని ఈ సదస్సులో పాల్గొనుతున్నారు.
Date : 17-06-2025 - 10:09 IST -
Air Travel : విమానం అంటేనే వణికిపోతున్నారు
Air Travel : ఎప్పుడు ఎక్కడ ఏ విమానం కూలిపోతుందో తెలియడం లేదు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం (Ahmedabad Air India Plane Crash) ఇళ్ల మధ్యలో కూలిపిన ఘటన లో విమానంలో
Date : 17-06-2025 - 9:46 IST -
CM Revanth Reddy : రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించండి: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
టీవల జాతీయ వైద్య మండలి (నేషనల్ మెడికల్ కౌన్సిల్ - NMC) రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలల్లో వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేయడం, దీనిపై వివరణ కోరడాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం, తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 18న ఢిల్లీకి హాజరై వివరాలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)లను ఎన్‌ఎంసీ ఆదేశించింది.
Date : 16-06-2025 - 4:34 IST -
PM Modi : విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు
జూన్ 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నేరుగా విశాఖ చేరుకుంటారు. అనంతరం తూర్పు నౌకాదళం అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. తరువాతి రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై 7:45 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్‌కు విజయవంతంగా నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు.
Date : 16-06-2025 - 3:46 IST -
Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం
ఈ మొత్తం విడుదలకు ముందు ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా థంబ్ ఇంప్రెషన్ (వెరీఫికేషన్) చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో (RBKs) ఈ థంబ్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, రైతులు తమ ఆధార్‌తో పాటు తమ మొబైల్ ఫోన్ తీసుకుని దగ్గరిలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి.
Date : 16-06-2025 - 3:29 IST -
Cyprus : ప్రధాని మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకుంటూ మోడీ మాట్లాడారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయుల తరపున వచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. సైప్రస్ ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు.
Date : 16-06-2025 - 3:18 IST -
SBI FD rates : ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్లలో కోత.. తాజా వడ్డీ రేట్ల వివరాలు ఇవీ..
జూన్ 15, 2025 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని ప్రభావంతో బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI) వంటి బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను సవరించాయి.
Date : 16-06-2025 - 3:07 IST -
Matangeshwar Temple : ఏటా పెరుగుతున్న శివలింగం..ఎక్కడుందా ఆలయం? విశేషాలేంటి? తెలుసుకుందాం!
మాతంగేశ్వర ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ? ఇది శిల్పాలకంటే ఎక్కువగా ఒక మర్మమైన రహస్యాన్ని కలిగివుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం కింద భూమిలో 18 అడుగుల లోతున విలువైన నిధి దాగి ఉందని స్థానికుల నమ్మకం. దీన్ని సాధారణంగా కాదు, ఋషులు మరియు దైవిక శక్తులు స్వయంగా కాపాడుతున్నారంటారు.
Date : 16-06-2025 - 2:50 IST -
Tirumala : శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పవిత్ర వేదమంత్రాలతో వేదాశీర్వచనం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పండితులు పీయూష్ గోయల్ కు శేషవస్త్రం కప్పి, శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.
Date : 16-06-2025 - 2:03 IST -
Israel: ఇరాన్ క్షిపణి దాడి..స్వల్పంగా దెబ్బతిన అమెరికా దౌత్య కార్యాలయం..!
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన వేళ, ఈ దాడులు తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాల్ ఖట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "ఇరాన్ మా పౌరులపై దాడులు చేస్తే, టెహ్రాన్ నగర ప్రజలే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది," అని ఆయన హెచ్చరించారు.
Date : 16-06-2025 - 1:49 IST -
PM Modi : డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే: ప్రధాని మోడీ
దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లిమాసోల్‌లో నిర్వహించిన భారత్-సైప్రస్ సీఈవో ఫోరమ్‌లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో 50 శాతం యూపీఐ (UPI) ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Date : 16-06-2025 - 1:01 IST -
Census : ‘జన గణన’కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన హోంశాఖ
ఈ భారీ గణాంక ప్రక్రియను రెండు దశలుగా చేపట్టనున్నారు. పూర్తి ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి జనగణనలో ప్రాధాన్యతగల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Date : 16-06-2025 - 12:49 IST -
Padi kaushik Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వ్యాపార సంబంధమైన కారణాలతో ఆయన్ను బెదిరించారని ఆరోపిస్తూ మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బలవంతంగా బెదిరించారని ఆమె ఆరోపించారు.
Date : 16-06-2025 - 12:30 IST -
KTR : ఇప్పటికి మూడు సార్లు పిలిచారు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్
మమ్మల్ని విచారణలకు పిలిచి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మూడు సార్లు విచారణకు పిలిచారు. మళ్లీ 30 సార్లు పిలిచినా, నేను విచారణకు హాజరవుతాను. చట్టాలపై, న్యాయవ్యవస్థపై నమ్మకముంది. నిజం నిలబడుతుందనే నమ్మకం నాకు ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Date : 16-06-2025 - 11:21 IST -
Kommineni Srinivasa Rao : నేడు జైలు నుంచి విడుదలకానున్న కొమ్మినేని శ్రీనివాసరావు
శని, ఆదివారాలు కోర్టులకు సెలవులు ఉండటం వల్ల అనివార్యంగా విడుదల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో, నేటి రోజు (జూన్ 17) మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీ పత్రాలను సమర్పించి, ఆయనను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే న్యాయపరమైన పనులు పూర్తిచేసే దశలో ఉన్నాయి.
Date : 16-06-2025 - 10:58 IST -
Sriharikota : శ్రీహరికోటలోని షార్‌కు బాంబు బెదిరింపులు
ఈ బెదిరింపు విషయాన్ని తమిళనాడు కమాండ్ కంట్రోల్‌కు అధికారికంగా తెలియజేశారు. దీంతో తమిళనాడు భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. షార్ పరిసరాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు, డ్రోన్ మానిటరింగ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా గాలింపు చేపట్టారు.
Date : 16-06-2025 - 9:52 IST