HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Only Those Who Cant Do Anything Engage In Corpse Politics Cm Chandrababu

CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు

కారు కింద పడ్డ మనిషిని కుక్కపిల్లలా పక్కకు నెట్టేసి పోతారా? కంపచెట్లలో పడేసి వెళ్లడమంటే మానవత్వం ఉందా? సామాజిక స్పృహ లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఎలా న్యాయబద్ధీకరిస్తారు?అంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను బెదిరించడం, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

  • Author : Latha Suma Date : 03-07-2025 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Only those who can't do anything engage in corpse politics: CM Chandrababu
Only those who can't do anything engage in corpse politics: CM Chandrababu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు తాత్కాలికమని, కానీ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పనులు శాశ్వతమవుతాయన్నారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, తాను ఎప్పుడూ తప్పుడు ఆరోపణలతో రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. కారు కింద పడ్డ మనిషిని కుక్కపిల్లలా పక్కకు నెట్టేసి పోతారా? కంపచెట్లలో పడేసి వెళ్లడమంటే మానవత్వం ఉందా? సామాజిక స్పృహ లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఎలా న్యాయబద్ధీకరిస్తారు? అంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను బెదిరించడం, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఏమీ చేయలేని వాళ్లు శవ రాజకీయాలు చేస్తారుఅంటూ ఆయన ధ్వజమెత్తారు.

Read Also: Jagan : జగన్ ప్లాన్ బెడిసికొట్టింది.

బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకత అనవసరమని, ఇది ఎలాంటి నష్టాన్ని కలిగించదని సీఎం చంద్రబాబు వివరించారు. గోదావరిలో ప్రతి సంవత్సరం సగటున 2వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, అందులో 200 టీఎంసీలను వినియోగించినా ఎవరికీ నష్టం లేకుండా తెలుగువారికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా. కానీ కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అని పేర్కొన్నారు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఎప్పటికీ వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పారు. రాయలసీమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు విశేషంగా దృష్టి సారించామని తెలిపారు. ఒక్కసారిగా రూ. 3,950 కోట్లు హంద్రీనీవా ప్రాజెక్టుకు విడుదల చేశామని చెప్పారు.

మైక్రో ఇరిగేషన్‌ పథకానికి 90 శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్నాం. వాణిజ్య పంటల్లో ఒక్కోసారి ధరలు తగ్గినా, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం అని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వారు ఒక్క బిడ్డ ఉన్న తల్లికే అమ్మఒడి ఇచ్చారన్నారు. కానీ తమ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లిని గౌరవిస్తూ అందరికీ సాయంగా నిలుస్తోందన్నారు. మేము తల్లికి వందనం చేస్తున్నాం. రైతుకు బాసటగా నిలుస్తున్నాం. ఇది మా పాలన విధానం అంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక, ప్రజలు తప్పుడు ప్రచారాలకు లోనుకాకుండా, అభివృద్ధి పథంలో సాగుతున్న నిజాన్ని గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: Konda Murali : నాకు ప్రజాబలం ఉంది..చాలా కేసులకే నేను భయపడలేదు: కొండా మురళి

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banakacharla Project
  • CM Chandrababu
  • false propaganda
  • godavari
  • kuppam

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd