HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Modi Is A Transformative Force Trinidad Pm Praises Him

PM Modi : మోడీ ఒక పరివర్తనా శక్తి : ట్రినిడాడ్ ప్రధాని ప్రశంసలు

ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేస్సర్ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. "మోడీ గారూ, మీ నాయకత్వానికి మా శిరస్సు వంచి నమస్కారాలు," అంటూ ఆయన సేవలను కొనియాడారు. ప్రపంచ నేతగా మోడీ చూపుతున్న ప్రబల నాయకత్వం, విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులతో ఆయన కొనసాగిస్తున్న బలమైన సంబంధాలు, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో తీసుకున్న మానవతా నిర్ణయాలు ఈ గౌరవానికి కారణంగా పేర్కొన్నారు.

  • Author : Latha Suma Date : 04-07-2025 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi is a transformative force: Trinidad PM praises him
Modi is a transformative force: Trinidad PM praises him

PM Modi : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో తన దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ను ప్రధాని మోడీకి ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేస్సర్ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. “మోడీ గారూ, మీ నాయకత్వానికి మా శిరస్సు వంచి నమస్కారాలు,” అంటూ ఆయన సేవలను కొనియాడారు. ప్రపంచ నేతగా మోడీ చూపుతున్న ప్రబల నాయకత్వం, విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులతో ఆయన కొనసాగిస్తున్న బలమైన సంబంధాలు, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో తీసుకున్న మానవతా నిర్ణయాలు ఈ గౌరవానికి కారణంగా పేర్కొన్నారు.

Read Also: Show Time : షో టైం మూవీ ఎలా ఉందంటే ..!!

కరోనా సమయాల్లో మోడీ తీసుకున్న వ్యాక్సిన్ మైత్రి చర్యలతో మాకు సహా అనేక చిన్న దేశాలకు భారీగా మద్దతు లభించింది. ఇది కేవలం దౌత్యకౌశలం కాదు, ఇది మానవత్వానికి నిదర్శనం అని ఆమె అన్నారు. మోడీ ప్రస్తుతం భారతదేశాన్ని ఆర్థిక, సాంకేతిక రంగాలలో ఆధునీకరించిన దార్శనిక నాయకుడిగా అభివర్ణిస్తూ, ఆయన ద్వారా దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా పెరిగిందని చెప్పారు. మోడీ ఒక పరివర్తనా శక్తిగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా అభివృద్ధి చేయడమే కాకుండా, దేశాన్ని ప్రపంచస్థాయిలో శక్తివంతంగా నిలబెట్టారు. ఈ కారణంగానే మా దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయనకు అందించబోతున్నాం అని స్పష్టం చేశారు.

మోడీ గతంలో 2002లో ఒక సాంస్కృతిక రాయబారిగా ట్రినిడాడ్ అండ్ టొబాగోను సందర్శించిన సందర్భాన్ని కమలా ప్రసాద్ గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా తిరిగి వస్తుండటం గర్వకారణమన్నారు. ఇది ట్రినిడాడ్ ప్రజల పట్ల ఉన్న మోదీగారి ప్రేమకు గుర్తింపుగా భావిస్తున్నాం. ఆయన పర్యటన మాకు గౌరవాన్ని తీసుకొస్తోంది అని ఆమె తెలిపారు. ఇటీవలే ప్రధాని మోడీ గయానా, డొమినికా, బార్బడోస్ వంటి దేశాల నుంచి కూడా అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ కలిపి మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యతను, ప్రజలలో ఆయన పెంచుకున్న విశ్వాసాన్ని స్పష్టంగా చాటుతున్నాయి. మొత్తానికి, ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకటించిన ఈ గౌరవం ప్రధాని మోదీకి వరుసగా లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపులలో మరో మైలురాయిగా నిలిచింది. ఇది భారతదేశం గర్వించదగ్గ సందర్భమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: One Big Beautiful Bill: అమెరికాలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం.. ఈ బిల్లు ప్ర‌భావం భార‌త్‌పై ఎంత‌?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Global Leader
  • Kamla Persad-Bissessar
  • Order of the Republic
  • pm modi
  • Trinidad and Tobago

Related News

Markapuram Road accident pm modi

Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Trump- PM Modi

    యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ!

Latest News

  • మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న‌ ఒత్తిడి?!

  • Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

  • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

Trending News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd