Trending
-
Aarya : హీరో ఆర్య నివాసంలో ఐటీ సోదాలు
ఈ ఘటనపై ఆర్య స్పందించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన సీ షెల్ రెస్టారెంట్ వ్యాపారంతో నాకు ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేదు. ఆ వ్యాపారం నిర్వహణ బాధ్యతలను నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఒక స్నేహితునికి అప్పగించాను. ఇప్పుడు జరుగుతున్న ఐటీ దాడుల పట్ల నేను సహకరిస్తున్నాను అని అన్నారు.
Date : 18-06-2025 - 1:37 IST -
FASTag annual pass : ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
ఈ పాస్‌ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది.
Date : 18-06-2025 - 1:21 IST -
CM Revanth Reddy : గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఇది రెండో కేంద్రం కావడం విశేషం కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇది గూగుల్ సంస్థకు నాలుగవ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కావడం గర్వకారణం. ఈ సెంటర్ ప్రారంభంతో హైదరాబాద్ నగరం గ్లోబల్ డిజిటల్ భద్రత రంగంలో కీలక పాత్ర పోషించనున్నది.
Date : 18-06-2025 - 12:59 IST -
Hindi language : పాఠశాలల్లో హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం..
బుధవారం మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, హిందీ భాషను తప్పనిసరి అన్న నిర్ణయాన్ని సవరించింది. కొత్త ప్రకటనలో "తప్పనిసరి" అనే పదాన్ని తొలగిస్తూ, హిందీ బదులుగా విద్యార్థులు ఇతర భాషలను కూడా ఎంచుకునే అవకాశం కల్పించింది.
Date : 18-06-2025 - 12:43 IST -
Bomb Threats : బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు..బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు
అప్రమత్తమైన పోలీసు శాఖ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాయి. ఈమెయిల్ సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించిన అధికారులు, ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని వెంటనే విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Date : 18-06-2025 - 12:18 IST -
Nara Lokesh : ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేశ్ భేటీ
ఈ క్రమంలోనే ఈ ఉదయం నారా లోకేశ్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం సుమారు గంటపాటు కొనసాగినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
Date : 18-06-2025 - 11:28 IST -
PM Modi : పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ.. మీ ప్రమేయం లేదు: ట్రంప్‌తో మోడీ
చివరికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై తొలిసారి స్పందిస్తూ, భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా ఏ రకంగానూ మద్యవర్తిగా వ్యవహరించలేదని తేల్చిచెప్పారు.
Date : 18-06-2025 - 11:07 IST -
ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా
శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్‌ను అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. ఇందులో భారత్‌కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు భాగస్వాములుగా ఉన్నాయి.
Date : 18-06-2025 - 10:38 IST -
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారికి సమాజంలో గౌరవం లభించదు!
చాణక్య ప్రకారం.. ఎవరైనా ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా ఏదైనా పని చేసి నష్టపోతే అది అతని మూర్ఖత్వం. అలాంటి వ్యక్తులు ఏ పని ప్రారంభించే ముందు దాని ఫలితాల గురించి ఆలోచించరు.
Date : 17-06-2025 - 8:50 IST -
Starbucks: స్టార్‌బక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా చాయ్‌వాలా.. అసలు నిజమిదే!
ఈ మొత్తం వివాదం ఒక ఏప్రిల్ ఫూల్స్ డే మీమ్ నుంచి ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆదిత్య ఓజా అనే వ్యక్తి ఫోటోషాప్ చేసిన ఒక చిత్రాన్ని షేర్ చేశాడు.
Date : 17-06-2025 - 7:10 IST -
TTD : రేణిగుంట ఎయిర్‌పోర్టుకు శ్రీవారి పేరు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు. తిరుమలకు సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయానికి శ్రీవారి అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరు పెట్టాలని టీటీడీ ప్రతిపాదించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు అధికారిక లేఖ రాయాలని నిర్ణయించడంతో, భవిష్యత్‌లో తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి పేరుతోనే విమానాశ్రయం స్వాగతం పలికే అవకాశముంది.
Date : 17-06-2025 - 5:43 IST -
CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు.
Date : 17-06-2025 - 4:46 IST -
Kavitha : బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి.. జూలై 17న రైల్ రోకో : ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జూలై 17న రైల్ రోకో చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇది మామూలు ఆందోళన కాదు, ఇది బీసీ సమాజం ప్రతిష్టాత్మక పోరాటం అని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల బీసీ సంఘాల భాగస్వామ్యంతో దేశవ్యాప్త స్థాయిలో ఈ ఉద్యమాన్ని విస్తరించాలన్నదే తమ లక్ష్యమని కవిత వివరించారు.
Date : 17-06-2025 - 4:17 IST -
Phone Tapping Case : రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య : మహేశ్‌కుమార్ గౌడ్
టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధంగా మా ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత హక్కుల్ని హరిస్తూ జరిగిన ఈ చర్య పూర్తిగా హేయమైనది. ఈ దుశ్చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్‌లు సిగ్గుతో తలదించుకోవాలి అని ఘాటుగా స్పందించారు.
Date : 17-06-2025 - 3:08 IST -
AP : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల షెడ్యూల్
బదిలీలకు సంబంధించి తొలుత 16 నుంచి 18వ తేదీ వరకు హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో ప్రతి ఉద్యోగి ఎక్కడి పోస్టులో, ఎంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడో వివరాలను సేకరించనున్నారు.
Date : 17-06-2025 - 2:42 IST -
Air India : అహ్మదాబాద్ టు లండన్..మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
AI-171 ఫ్లైట్ నంబర్‌ను ఎయిరిండియా రద్దు చేసి, దాని స్థానంలో AI-159 అనే కొత్త నంబరును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు అదే కొత్త నంబర్‌తో సంబంధం ఉన్న విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో, ప్రయాణికుల నమ్మకం పూర్తిగా దిగజారింది. జూన్ 17న, మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో టేకాఫ్‌కు ముందు తనిఖీల్లో సాంకేతిక లోపం గుర
Date : 17-06-2025 - 2:04 IST -
Russia- Ukrain : ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడ్డ రష్యా..14 మంది మృతి
ఈ దాడుల్లో కనీసం 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. కీవ్ సైనిక పరిపాలన అధిపతి తైమూర్ ట్కాచెంకో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడిలో నగరంలోని డజన్లకొద్దీ అపార్ట్‌మెంట్ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Date : 17-06-2025 - 1:07 IST -
Mahesh Kumar Goud : ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు
2023 నవంబరులో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్‌కుమార్ గౌడ్ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన కీలకంగా పనిచేశారు.
Date : 17-06-2025 - 12:44 IST -
Israel-Iran Conflict : పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల మూసివేత
ముఖ్యంగా గగనతలంపై ఆంక్షలతో పాటు విమానాశ్రయాల మూసివేత వల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఈ యుద్ధం నేపథ్యంలో మొదటగా ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. అంతకుముందు ఎప్పుడూ ఆగని తేహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది.
Date : 17-06-2025 - 12:12 IST -
ATMs : ఆర్‌బీఐ గడువుకు ముందే పురోగతి..ఏటీఎంల్లో పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత
ప్రముఖ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2023 డిసెంబరులో ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్ల లభ్యత 65 శాతంగా ఉండగా, 2024 జూన్ నాటికి అది 73 శాతానికి పెరిగింది.
Date : 17-06-2025 - 11:46 IST