HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Supreme Courts Key Verdict On Accident Insurance Policy

Supreme Court : ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఒకవేళ వాహనదారుడు తన తప్పిదం వల్లే ప్రమాదానికి గురైతే, బీమా కంపెనీకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదు. బాధితుడి కుటుంబ సభ్యులు బీమా పాలసీ షరతులను మరియు అర్హతను కోర్టులో నిరూపించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది.

  • Author : Latha Suma Date : 03-07-2025 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Court
Supreme Court

Supreme Court : వాహనాలను అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడిపినపుడు జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు బీమా సంస్థలు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి వాహనం నడిపినట్లు ఆధారాలు ఉన్నపుడు బీమా పాలసీ ప్రయోజనాలను పొందలేరని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భవిష్యత్తులో ఇలాంటి బీమా క్లెయిమ్‌లపై పెద్ద ప్రభావం పడే అవకాశముంది. ఈ కేసు 2014 జూన్ 18న కర్ణాటకలో జరిగింది. రవీష్ అనే వ్యక్తి తన కారును అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతను మరణించాడు. రవీష్ కుటుంబ సభ్యులు తరువాత అతని మీద ఉన్న పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కింద రూ.80 లక్షల బీమా పరిహారం కోరి ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించారు.

Read Also: Anganwadi : అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

కానీ కంపెనీ ఈ క్లెయిమ్‌ను తిరస్కరించడంతో వారు కర్ణాటక హైకోర్టులో కేసు వేశారు. పోలీసుల విచారణలో దాఖలైన చార్జ్‌షీటులో, రవీష్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందునే ప్రమాదం జరిగిందని స్పష్టంగా పేర్కొనబడింది. అయితే, రవీష్ కుటుంబం మాత్రం టైరు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని వాదించారు. కానీ కోర్టు రవీష్ నిర్లక్ష్యం స్పష్టంగా తేలిందని తెలిపి, వారి వాదనలను తోసిపుచ్చింది. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కోర్టు తేల్చింది. దీంతో బీమా క్లెయిమ్‌ అర్హత లేదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ కేసును జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. విచారణ అనంతరం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

రవీష్ ప్రమాదానికి గురైనది అతని స్వంత నిర్లక్ష్యం వల్లనేనని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా బీమా క్లెయిమ్‌ నిరాకరించింది. ఒకవేళ వాహనదారుడు తన తప్పిదం వల్లే ప్రమాదానికి గురైతే, బీమా కంపెనీకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదు. బాధితుడి కుటుంబ సభ్యులు బీమా పాలసీ షరతులను మరియు అర్హతను కోర్టులో నిరూపించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఈ తీర్పు భారతదేశంలో ట్రాఫిక్ బాధ్యతలపై ప్రజలకు స్పష్టతనిస్తుంది. నిర్లక్ష్యం, రూల్ బ్రేకింగ్ వలన జరిగిన ప్రమాదాలకు బీమా కంపెనీలను బాధ్యతవహించాల్సిందేమీ లేదని ఈ తీర్పుతో తేలిపోయింది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలన్న సందేశాన్ని ఈ తీర్పు అందిస్తోంది.

Read Also: Coffee : కాఫీ ఇష్టంగా తాగుతున్నారా? ఆరోగ్యానికి హాని చేసే ఈ విషయాలు మర్చిపోవద్దు!

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Accident Insurance Policy
  • Insurance Policy
  • karnataka high court
  • Ravish
  • Sentational verdict
  • Supreme Court

Related News

Telangana, Mla Defection

సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

Supreme Court  తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్‌చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం లేదని

  • Supreme Court allows passive euthanasia for Harish Rana

    సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Latest News

  • బాలీవుడ్ లోకి బోయపాటి.. సన్నీ డియోల్ జాట్ 2 కు దర్శకత్వం వహించే ఛాన్స్!

  • ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల

  • Accident : నిజామాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు

  • కావ్య మారన్‌కి బిగ్ జలక్.. పాక్ ప్లేయర్‌ కొనుగోలుపై ఫ్యాన్స్ ఫైర్

  • War Effect : సామాన్య ప్రజలకు మరో షాక్..భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ ధర

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd