HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Dalai Lama Has Right To Decide Successor India

Dalai Lama : వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది : భారత్‌

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు గురువారం విడుదల చేసిన ప్రకటనలో దలైలామా పదవి కేవలం టిబెటన్‌ ప్రజలకే కాదు, ఆయనను అనుసరించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ప్రాధాన్యత కలిగినది. వారసుడి ఎంపికలో నిర్ణయాధికారం దలైలామాకే ఉంటుంది అని స్పష్టం చేశారు.

  • By Latha Suma Published Date - 02:22 PM, Thu - 3 July 25
  • daily-hunt
Dalai Lama
Dalai Lama

Dalai Lama : దలైలామా వారసుడి ఎంపికపై చైనా చేస్తున్న ప్రకటనలపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ దలైలామా ఎంపిక పూర్తిగా ప్రస్తుత దలైలామా ఆధ్వర్యంలోనే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో బీజింగ్‌కు ఎలాంటి హక్కులుండవని, టిబెటన్‌ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం ఈ నిర్ణయం పూర్తిగా ఆధ్యాత్మిక నాయకుడైన దలైలామాకు చెందుతుందని భారత ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు గురువారం విడుదల చేసిన ప్రకటనలో దలైలామా పదవి కేవలం టిబెటన్‌ ప్రజలకే కాదు, ఆయనను అనుసరించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ప్రాధాన్యత కలిగినది. వారసుడి ఎంపికలో నిర్ణయాధికారం దలైలామాకే ఉంటుంది అని స్పష్టం చేశారు.

Read Also: Vallabhaneni Vamsi : జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ

ఇప్పటికే చైనా ప్రకటించిన భవిష్యత్‌ దలైలామా తమ ఆమోదంతోనే ఉండాలి అనే వ్యాఖ్యలపై 14వ దలైలామా టెన్జిన్‌ గ్యాట్సో, అలియాస్‌ లామా ధోండప్‌ ఘాటుగా స్పందించారు. టిబెటన్‌ సంప్రదాయాల ప్రకారం, కొత్త దలైలామా ఎంపిక 600 ఏళ్ల నాటి బౌద్ధ ఆచారాల ఆధారంగా మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. దీనిలో చైనా ఎలాంటి పాత్ర పోషించదని, ఈ నిర్ణయం తమ “గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌” ఆధ్వర్యంలోనే ఉంటుందని తెలిపారు. తన 90వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మెక్లియోడ్‌గంజ్‌లో జరిగిన ఆధ్యాత్మిక సమావేశంలో దలైలామా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చైనా ఎంపిక చేసిన ఎవరినైనా తిరస్కరించాలి అంటూ ఆయన బహిరంగంగా చెప్పడం గమనార్హం.

దలైలామా విడుదల చేసిన ప్రకటనలో తదుపరి దలైలామా ఎవరో గుర్తించే హక్కు గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కే ఉంటుంది. ఇది సంప్రదాయపరంగా ధర్మ పరిరక్షకుల సమన్వయంలో జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. ఆయన మరణానంతరం తమ ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మ పొందుతుందని బౌద్ధుల నమ్మకం. ఇప్పటిదాకా దలైలామాల ఎంపిక అదే పద్ధతిలో జరిగింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ..భవిష్యత్‌ దలైలామా ఎంపిక చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని వ్యాఖ్యానించారు. ఇది టిబెటన్‌ బౌద్ధ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని భారతం సూటిగా చెప్పింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్దాలుగా టిబెటన్‌ మత స్వాతంత్య్రంపై తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుండగా, ఈ తాజా ప్రకటనలు మరోసారి ఉద్రిక్తతను రెచ్చగొడుతున్నాయి.

1959లో టిబెట్‌ ఆక్రమణ తర్వాత దలైలామా భారత్‌కు ఆశ్రయానికి వచ్చారు. అప్పటి నుంచి ధర్మశాలలో నివసిస్తున్న ఆయన ఉనికి చైనా, భారత్‌ మధ్య సున్నిత అంశంగా మారింది. భారత్‌ మాత్రం ఇప్పటికీ టిబెటన్‌ మతస్వేచ్ఛకు మద్దతుగా నిలుస్తోంది. అమెరికా కూడా ఇదే తరహాలో స్పందించింది. మత స్వేచ్ఛకు హాని కలిగించేలా చైనా జోక్యం చేసుకోవడం మానేయాలని, వారసత్వ వ్యవహారంలో బీజింగ్‌ నోటికట్టుకోవాలని హెచ్చరించింది. దలైలామా వారసత్వం భవిష్యత్తులో టిబెటన్‌ ప్రజల హక్కులకు, ప్రపంచంలోని బౌద్ధ మత విశ్వాసాలకు కీలకమవుతుంది.

Read Also: Patanjali : ప్రకటనల ప్రచారాన్ని ఆపండి.. పతంజలికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • Dalai Lama
  • Dalai Lama Successor
  • india
  • Kiren Rijiju
  • Tibetan Buddhist tradition

Related News

PM Modi Degree

Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్‌ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మోడీ స్వాగతిస్తూ, ఇరు దేశాల సంబంధాలు ఎప్పటికీ బలంగా, సానుకూలంగానే కొనసాగుతాయని తెలిపారు.

  • Trade War

    Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • Putin- Kim Jong

    Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

Latest News

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd