Trending
-
Minister Lokesh : రాష్ట్రంలోని 80శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు : మంత్రి లోకేశ్
కొందరి ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల నిధులు తిరిగి వచ్చాయి. సంబంధిత తల్లులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలి. ఖాతాలు యాక్టివ్ అయిన వెంటనే వందనం నిధులు విడుదల చేస్తాం అని మంత్రి లోకేష్ చెప్పారు. అయితే అంగన్వాడీ పిల్లల తల్లులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.
Date : 13-06-2025 - 6:09 IST -
Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపుకు ప్రభుత్వం కసరత్తు
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో కొత్త మార్గదర్శక విలువలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు పలు మండలాల్లో స్థలాల మార్కెట్ ధరకట్టను సమీక్షించేందుకు ఫీల్డ్ పరిశీలనలు ప్రారంభించారు. ప్రత్యేకించి అపార్ట్మెంట్ల ధరల విషయంలో సుమారు 30 శాతం మేర పెంపు ఉండే సూచనలు ఉన్నాయి.
Date : 13-06-2025 - 5:06 IST -
KTR : మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
. జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే మే 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు పంపినప్పటికీ, అప్పటికి కేటీఆర్ అమెరికాలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయారు.
Date : 13-06-2025 - 4:41 IST -
PM Modi : విజయ్‌రూపానీ కుటుంబసభ్యులకు ప్రధాని మోడీ పరామర్శ
విజయ్ రూపాణీ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విమానం ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, తక్షణ సహాయ చర్యలలో భాగంగా వైమానిక అధికారులు, ఆర్మీ, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
Date : 13-06-2025 - 3:59 IST -
Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్ రైలు..ప్రయాణికులు అవస్థలు
ఈ ఘటన వల్ల రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సదుపాయం పనిచేయకపోవడంతో గాలి లేక ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో, ఎండలో ఉన్నట్లే ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అరగంటకుపైగా రైలు నెల్లూరు స్టేషన్లో నిలిపివేయబడింది.
Date : 13-06-2025 - 2:36 IST -
Plane Crash : ఎలా బతికానో నాకే అర్థం కాలేదు..విమాన ప్రమాద మృత్యుంజయుడు విశ్వాస్
ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్.. ప్రమాద క్షణాలను గుర్తుచేస్తూ మీడియాతో అనుభవాలనుపంచుకున్నారు. విమాన టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా అది భీకరంగా ఊగింది. నిమిషాల వ్యవధిలో అది ముక్కలైంది. నేను కూర్చున్న 11-ఏ సీటు విరిగిపోయి దూరంగా ఎగిరిపడింది. అది నా ప్రాణాలను రక్షించింది అని అన్నారు.
Date : 13-06-2025 - 1:06 IST -
Air India Compensation: ఎయిరిండియా రూ. కోటి కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి వస్తుందా?
విమాన ప్రయాణం చేసే ముందు భద్రత, భవిష్యత్తు ప్రణాళిక చాలా అవసరం. ఒక చిన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైనా అనుకోని సంఘటనలో పెద్ద ఆసరాగా ఉంటుంది. సురక్షిత ప్రయాణం కోసం ఇన్సూరెన్స్‌ను మీ అలవాటులో భాగం చేసుకోండి.
Date : 13-06-2025 - 12:54 IST -
Bomb Threat : బాంబు బెదిరింపు.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్
శుక్రవారం మరో విమాన సంఘటన కలకలం రేపింది. ఫుకెట్ (థాయిలాండ్) నుండి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం స్థానిక సమయం 9:30 గంటలకు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా AI 379 విమానానికి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు బెదిరింపు వచ్చింది.
Date : 13-06-2025 - 12:49 IST -
India-China : త్వరలో భారత్ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
.భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు చర్చలు జరిపాం. ఈ అంశంపై త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మిస్రీ ప్రత్యేకంగా అభినందించారు.
Date : 13-06-2025 - 12:33 IST -
Iran : ప్రతీకార దాడులు..ఇజ్రాయెల్‌పై వంద డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
వీటిలో చాలావరకు డ్రోన్లను ఇజ్రాయెల్ రక్షణ బలగాలు గగనతలంలోనే గుర్తించి తిప్పికొట్టాయి. కానీ ఈ దాడుల వల్ల ప్రాంతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ఈ చర్యను పూర్తిగా ప్రతీకార చర్యగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇటీవల టెహ్రాన్ సమీపంలో జరిగిన గూఢచర్య దాడిలో తమ దేశానికి చెందిన కీలక నాయకులు, శాస్త్రవేత్తలు హతమయ్యారని ఇరాన్ ఆరోపించింది.
Date : 13-06-2025 - 12:23 IST -
PM Modi : అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని సమీక్ష.. విజయ్ రూపానీ ఫ్యామిలీని పరామర్శించనున్న మోడీ
విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీని ప్రధాని మోడీ పరామర్శించనున్నారు. విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతిని తెలుపనున్నారు. దేశానికి అద్భుత సేవలు అందించిన నేతను కోల్పోవడం బాధాకరమని ప్రధాని పేర్కొన్నారు.
Date : 13-06-2025 - 12:06 IST -
CM Chandrababu : సీఎం చంద్రబాబు వైజాగ్ టూర్ రద్దు..కారణం ఇదే
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన దుర్మార్గమైన విమాన ప్రమాదం నేపథ్యంలో సీఎం తన పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసినట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Date : 13-06-2025 - 11:43 IST -
Roshni Songare: ఎయిర్ హోస్టెస్ కావాలని కల.. చివరకు విమాన ప్రమాదంలోనే మృతి!
డోంబివలి నివాసియైన 26 ఏళ్ల కుమారి రోషిణీ రాజేందర్ సోంఘరే కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఆమె తండ్రి రాజేందర్ ధోండూ సోంఘరే (50), ఆమె తల్లి శోభా రాజేందర్ సోంఘరే (45), ఆమె చిన్న సోదరుడు విగ్నేష్ రాజేందర్ సోంఘరే (23).
Date : 13-06-2025 - 11:39 IST -
Thalliki Vandanam : విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ: టీడీపీ
ఇందులో భాగంగా ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారుడి ఖాతాలో రూ.26,000 జమైనట్టు తెలిపింది. దీనిని ఆధారంగా తీసుకొని వచ్చిన బ్యాంక్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను కూడా టీడీపీ షేర్ చేసింది. అదేవిధంగా మరో రూ.4,000 పాఠశాల అభివృద్ధి ఖాతాలో జమ అయినట్లు పేర్కొంది.
Date : 13-06-2025 - 11:19 IST -
Ahmedabad : విమాన ప్రమాదం.. సహాయక చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధం: ముకేశ్ అంబానీ
రిలయన్స్ సంస్థ ఈ ప్రమాద బాధితుల పట్ల తన బాధ్యతను గుర్తుచేసుకుంటూ, సహాయక చర్యలకు తమ పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలలో పాల్గొనడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. అవసరమైన అన్ని సహాయాలను అందించేందుకు మేము సమర్పితంగా పనిచేస్తాం అని వారు తెలియజేశారు.
Date : 13-06-2025 - 10:32 IST -
Celebrities Died in Plane Crashes: విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే..!!
Celebrities Died in Plane Crashes: భారతదేశ గగనతల చరిత్రలో అనేక మంది ప్రముఖులు విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాల్లో ప్రాణాలు (Celebrities Died in Plane Crashes) కోల్పోయారు
Date : 12-06-2025 - 10:48 IST -
Vijay Rupani : విమాన ప్రమాదంలో మాజీ సీఎం మృతి..గుజరాత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన
ఈ విషాదకర ఘటనపై గుజరాత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ మాట్లాడుతూ..అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించారని తెలిపారు.
Date : 12-06-2025 - 8:17 IST -
Air crash incident : విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్
ఈ ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులకు మానవీయ సహాయంగా ముందుకు వచ్చిన టాటా గ్రూప్ చర్యలు ప్రశంసనీయం.
Date : 12-06-2025 - 8:02 IST -
Air india Flight Crash : విమాన ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మరణించారు: విదేశాంగ శాఖ ప్రకటన
ఈ ప్రమాదంపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన మాటలతో చెప్పలేని విషాదం. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
Date : 12-06-2025 - 5:44 IST -
Ahmedabad : బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడిన విమానం.. పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులు, డాక్టర్లు మృతి..!
ఈ ప్రమాదం అహ్మదాబాద్ హార్స్ క్యాంప్ సమీపంలో, సివిల్ హాస్పిటల్ దగ్గరలో జరిగింది. విమానం హాస్టల్ బ్లాక్‌పై కూలడంతో లోపల ఉన్న ఎంబీబీఎస్ విద్యార్థులు, ఇంటర్న్ డాక్టర్లు మంటల్లో చిక్కుకుని మరణించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, కనీసం 20 మంది వరకు విద్యార్థులు మృతిచెందినట్లు తెలుస్తోంది.
Date : 12-06-2025 - 5:23 IST