Trending
-
PM Modi : నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే!
, ప్రధాని మోడీ నేడు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బయలుదేరి, సుమారు సాయంత్రం 6.40కి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని అధికారుల వసతిగృహం (ఆఫీసర్స్ మెస్)కు చేరుకుంటారు.
Date : 20-06-2025 - 10:49 IST -
Yogandhra 2025 : విశాఖ యోగా వేడుక ప్రపంచానికి ఒక సందేశం – కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్
కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోతే చౌధరి గురువారం విశాఖలో ఏర్పాట్లను సమీక్షించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కలిసి విశ్లేషణలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది యోగా దినోత్సవం విశాఖలో జరగడం గర్వకారణం.
Date : 19-06-2025 - 6:52 IST -
TG : గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు..వెయ్యి టీఎంసీలు కావాలని చంద్రబాబును అడగటం ఏంటి?: హరీశ్‌రావు
అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలు నీటి హక్కు. అయినప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును వెయ్యి టీఎంసీల నీటిని అడగడం సరిగ్గా లేదు అని అన్నారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నామంటే, కేవలం 500 టీఎంసీల కోసం అడగడం రాష్ట్ర హక్కులను తక్కువ చేయడమేనని వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 6:30 IST -
Chandrababu : నీటి వనరుల వినియోగంపై వివాదాలు అవసరమా? : సీఎం చంద్రబాబు
కానీ పోలవరం ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులే. మనం మనం కలహపడితే చివరికి నష్టపోవేది ప్రజలే. తెలంగాణపై నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విభేదించలేదు. ఈ విషయాల్లో స్పష్టత ఉండాలి అని తెలిపారు.
Date : 19-06-2025 - 6:18 IST -
CM Chandrababu : రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రం మొత్తం ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్గాల్లో యోగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 9వ తరగతి నుంచే విద్యార్థులు యోగాను తప్పనిసరిగా అభ్యసించాలి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో యోగాపై ప్రత్యేక కోర్సులు, శిక్షణా శిబిరాలు మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Date : 19-06-2025 - 4:35 IST -
Bomb Threat : బెంగళూరు విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
దుండుగుడు తనను తాను ఉగ్రవాదినిగా పేర్కొనడం భయాందోళన కలిగించింది. బుధవారం రాత్రి విమానాశ్రయ భద్రతా విభాగానికి వచ్చిన ఈమెయిల్లో, అనుమానితుడు తన పేరు వెల్లడించకుండా, కెంపేగౌడ విమానాశ్రయంలో రెండు బాంబులు అమర్చినట్లు పేర్కొన్నాడు.
Date : 19-06-2025 - 4:22 IST -
Emobot : మీరు డిప్రెషన్ లో ఉన్నారా? మీ సెల్ఫీ కెమెరా ఇప్పుడు మీ మెటల్ హెల్త్ ని గుర్తించగలదు, ఎలాగో తెలుసా?
ఈ యాప్ వినియోగదారుల ముఖ కవళికలను విశ్లేషించి, వారి మనోభావాలను గుర్తించడంలో సహాయపడుతుంది. రోజంతా మొబైల్ ఫోన్ ముందు కెమెరా ద్వారా ముఖాన్ని పరిశీలిస్తూ, ఈ యాప్ వినియోగదారుల భావోద్వేగ పరిస్థితిని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. ఇది స్టెప్ కౌంట్ లేదా హార్ట్ రేట్ ట్రాకర్ల మాదిరిగానే పని చేస్తుంది.
Date : 19-06-2025 - 3:40 IST -
Uttam Kumar : గోదావరి-బనకచర్ల అంశం..త్వరలో ఇద్దరు సీఎంల భేటీ : మంత్రి ఉత్తమ్‌కుమార్
ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్‌కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 3:20 IST -
YS Sharmila: జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలు కాదు: షర్మిల
విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ నిర్లక్ష్యం వల్లే ఎంతోమంది యువకులు బెట్టింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి బల ప్రదర్శనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Date : 19-06-2025 - 2:27 IST -
Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్ భేటీ..నైపుణ్యాభివృద్ధిపై కీలక చర్చలు
విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోకేశ్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో టీబీఐ సంస్థ విద్యా రంగానికి సాంకేతిక మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపింది.
Date : 19-06-2025 - 2:06 IST -
Israel : ఇజ్రాయెల్‌లోని మెడికల్ సెంటర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..తీవ్ర ఉద్రిక్తతలు !
ఆస్పత్రిపై దాడి నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ఎవ్వరూ రాకూడదని, ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇది ఇజ్రాయెల్‌లో అత్యంత రద్దీగా ఉండే మెడికల్ సెంటర్లలో ఒకటి. అయితే అదృష్టవశాత్తూ నిన్నటితో పోలిస్తే ఈ రోజు దాడికి గురైన అంతస్తును ముందుగానే ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంబులెన్స్ సర్వీసు చీఫ్ ఎలిబెన్ తెలిపారు.
Date : 19-06-2025 - 12:53 IST -
Election Commission of India : ఓటర్ ఐడీ కార్డుల జారీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఈ మేరకు, ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసినవారికి కేవలం 15 రోజుల్లోపే కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారికే కాకుండా, ఇప్పటికే ఓటర్ ఐడీ ఉన్నవారు తమ వివరాల్లో మార్పులు కోరిన సందర్భాల్లోనూ వర్తిస్తుంది.
Date : 19-06-2025 - 12:11 IST -
APSRTC Special : పూరీ జగన్నాథ రథయాత్రకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు..టికెట్ ధర, బుకింగ్ వివరాలు ఇవే !
జూన్ 27న జరిగే రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS), విజయవాడ నుంచి పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. జూన్ 26న యాత్రలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశముంటుంది.
Date : 19-06-2025 - 11:31 IST -
Putin : జెలెన్‌స్కీను కలిసేందుకు సిద్ధమే.. కానీ ఇప్పుడు కాదు: పుతిన్
రష్యా యుద్ధాన్ని వీలైనంత త్వరగా, ప్రాముఖ్యతనిస్తూ శాంతియుత మార్గంలో ముగించాలని చూస్తోంది. కీవ్ మరియు దాని పాశ్చాత్య మిత్రదేశాలు చర్చలకు సిద్ధంగా ఉంటే, మేము కూడా చర్చలకు సిద్ధమేనని ఆయన చెప్పారు.
Date : 19-06-2025 - 10:42 IST -
Aadhaar Card: ఇంటి నుంచే నిమిషాల్లో ఆధార్ కార్డ్‌ను అప్డేట్ చేసుకోండిలా!
ఈ కొత్త అప్లికేషన్ ఈ విధంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఇచ్చిన QR కోడ్‌ను ఉపయోగించి ఆధార్‌ను ఒక మొబైల్ నుంచి మరో మొబైల్‌కు లేదా ఒక యాప్ నుంచి మరో యాప్‌కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
Date : 18-06-2025 - 8:11 IST -
AP : 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
ఉత్తర్వుల ప్రకారం, 2025 ఫిబ్రవరి 1 నాటికి అవసరమైన శిక్షను అనుభవించి సత్ప్రవర్తనతో ప్రవర్తించిన ఖైదీలను షరతులతో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా ఖైదీల మిగిలిన శిక్షను ప్రభుత్వం మాఫీ చేయనుంది. అయితే, ఇది పూర్తిగా ఒక పునరావాస విధానంగా తీసుకోవాలని, ఖైదీలు నిబంధనలకు లోబడి ప్రవర్తించాలని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Date : 18-06-2025 - 6:28 IST -
Telangana : ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలి తెలంగాణ వాసి మృతి
రవీంద్ర ఇజ్రాయెల్‌లో విజిట్ వీసాపై వెళ్లి, అక్కడ ఒక పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. అయితే అక్కడ భద్రతా పరిస్థితులు విషమించడంతో, తాను భయాందోళనకు గురవుతున్నట్లు ఇటీవలే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.
Date : 18-06-2025 - 4:20 IST -
Nara Lokesh : అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ..రాష్ట్ర అంశాలపై కీలక చర్చలు
నారా లోకేశ్ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో పరిపాలనా స్థాయి చర్చల కోసం కేంద్ర నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అమిత్ షాను ప్రత్యేకంగా కలిసి, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలు, అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల అవసరం, కేంద్ర సహకారం వంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
Date : 18-06-2025 - 3:35 IST -
YS Sharmila : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : వైఎస్ షర్మిల
ఇది కొత్తగా ఎవరు రమ్మన్నా, విచారణకు హాజరవుతానని ఇప్పుడే చెబుతున్నా. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించి విచారణ వేగవంతం చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు.
Date : 18-06-2025 - 3:19 IST -
Pakistan : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్
వివరాల్లోకి వెళ్తే, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు పేలుడు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించింది. ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) రకం బాంబు ట్రాక్‌పై అమర్చినట్లు అనుమానిస్తున్నారు.
Date : 18-06-2025 - 2:32 IST