Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
- By Kavya Krishna Published Date - 04:34 PM, Sat - 22 February 25

Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోయిన ఘటనను కాంగ్రెస్ పార్టీ అసమర్ధతకు నిదర్శనంగా పేర్కొన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కుప్పకూలిన విషయం వెలుగు చూసింది. సొరంగంలో పని చేస్తున్న 14 మంది కార్మికులు మట్టిలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు.
కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతకు, చేతగాని విధానానికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తరువాత, ఆరంభంలోనే కూలిపోయేలా చేసిన ఘనతను కాంగ్రెస్ పాలకులు సాధించారని ఆయన అన్నారు. తాజాగా సుంకిశాల వద్ద రీటైనింగ్ వాల్ కూలిన ఘటన, , ఇప్పుడు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం వల్ల కాంగ్రెస్ కమిషన్ సర్కారుకు ఎదురైన వైఫల్యాలను అంగీకరించాల్సిందేనని హరీష్ రావు పేర్కొన్నారు.
Shankar: ఆ విషయం నన్ను ఎంతో బాధించింది.. ఈడీ చర్యలపై అసహనం వ్యక్తం చేసిన శంకర్!
అంతేకాక, ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం నేరుగా తీసుకోవాల్సినదిగా ఆయన పేర్కొన్నారు. గత నాలుగు రోజుల నుండి కొద్దికొద్దిగా మట్టి కూలిపోతున్నా, ప్రభుత్వ అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, మరికొంత మంది కార్మికులు ఇంకా మట్టిలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని హరీష్ రావు పిలుపు ఇచ్చారు.
ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. అలాగే, శిథిలాలు తొలగించి, డీ వాటరింగ్ చేసి, విద్యుత్ పునరుద్ధరించి, కార్మికులను వెంటనే బయటకు తీసుకురావాలని సూచించారు. ఈ ఘటనపై వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Sourav Ganguly: మరో ఫ్యాక్టరీని స్టార్ట్ చేసిన సౌరవ్ గంగూలీ.. ఈసారి ఎక్కడంటే?