AP Cabinet : ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం నేడు జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు కీలక అంశాలు కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
- By Kavya Krishna Published Date - 10:19 AM, Tue - 3 December 24

AP Cabinet : రాష్ట్ర కేబినెట్ సమావేశం ముహూర్తం ఫిక్స్ అయింది. నేడు (మంగళవారం) ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్‌లోని కేబినెట్ హాల్‌లో ఈ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇది వాస్తవానికి డిసెంబర్ 4 (బుధవారం) జరగాల్సిన సమావేశం కాగా, ఆ తేదీ కంటే ముందుగానే జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు హ్యాండ్‌బుక్ ఫార్మాట్‌లో ప్రతిపాదనలు సోమవారం సాయంత్రం 4 గంటలలోగా పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
Health Festival : ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి కానున్న సందర్భంలో, ఇప్పటివరకు ప్రధాన హామీలలో కొన్ని మాత్రమే అమలులోకి వచ్చాయి. మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ హామీ దీపావళి నాటికి అమలు కాగా, మిగిలిన ఐదు హామీలు అమలులోకి రాలేదు..
ప్రధాన హామీలు ఇంకా అమలులోకి రాని అంశాలు:
ఉచిత బస్సు ప్రయాణం (మహిళల కోసం)
తల్లికి వందనం కింద విద్యార్థులకు రూ. 15,000
ప్రతి మహిళకు నెలకు రూ. 1,500
రైతులకు ఏడాదికి రూ. 20,000
నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 భృతి
20 లక్షల ఉద్యోగాల సృష్టి
ప్రజా అసంతృప్తికి కారణమైన అంశాలు:
విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల అమలు వంటి చర్యలు ప్రజల్లో అసంతృప్తి పెంచగా, వాలంటీర్ల తొలగింపు, ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దుతో ఉపాధి కోల్పోయిన ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శలుగా మారాయి.
కేబినెట్‌లో చర్చకు వచ్చే అంశాలు:
చెత్త పన్ను అమలు
రహదారులపై టోల్ టాక్స్ అంశం
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు
మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రకటనలపై స్పష్టత
ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం కీలకంగా మారింది. పలు ప్రతిపక్ష విమర్శలకు సమాధానంగా, ప్రజా మన్ననలను సంపాదించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Vladimir Putin : భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన ఖరారు..