Ramamurthy Naidu Passes Away: నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత.. బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ
రామ్మూర్తి నాయుడు రాజకీయ జీవితానికి వస్తే ఆయన 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నారు.
- By Gopichand Published Date - 03:22 PM, Sat - 16 November 24

Ramamurthy Naidu Passes Away: ఏపీ సీఎం చంద్రబాబు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు మరణించినట్లు (Ramamurthy Naidu Passes Away) ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ఓ బులెటిన్ విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు ఏఐజీ ఆసుపత్రికి చేరుకోనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన నేరుగా అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి ఆస్పత్రి వద్దకు రానున్నారు. ఏఐజీ హాస్పిటల్స్ లో ఏపీ మంత్రి నారా లోకేష్, నారా రోహిత్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆదివారం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 మధ్య కాలంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
Also Read: Owaisi VS Pawan : మీరు తల్వారులు పట్టుకొస్తే.. మేం చేతులు కట్టుకుని కూర్చొంటామా – పవన్
అంత్యక్రియలు రేపు?
అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన రామ్మూర్తి నాయుడు అంత్యక్రియులు రేపు నారావారిపల్లెలో జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్మూర్తి మరణవార్త విన్న నారా, నందమూరి అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
రామ్మూర్తి నాయుడు టీడీపీ ఎమ్మెల్యే కూడా
ఇక రామ్మూర్తి నాయుడు రాజకీయ జీవితానికి వస్తే ఆయన 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నారు. రోహిత్ నిశ్చితార్థం ఇటీవల ‘ప్రతినిధి 2’ హీరోయిన్ సిరిలెల్లాతో జరిగిన విషయం తెలిసిందే. వారి పెళ్లి సరిగ్గా నెలరోజులు ఉందనగా ఇప్పుడాయన తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడం.. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నెట్టేసింది. రామ్మూర్తి మరణవార్తతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు వస్తుండటంతో అధికారులు సైతం అలర్ట్ అయ్యారు.