HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Gas Cylinder Distribution

CM Chandrababu : పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచాం.. 45 ఏళ్ల తరువాత అతిపెద్ద విజయం సాధించాం.

CM Chandrababu : ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుందని, మేం మొన్న క్యాబినెట్ లో దీనిపై చర్చించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారని, దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన అన్నారు.

  • Author : Kavya Krishna Date : 01-11-2024 - 6:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu
Cm Chandrababu

CM Chandrababu : ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం, కూటమి ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించింది. ఈ భాగంగా, “దీపం” పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని చంద్రబాబు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసింది. గ్యాస్ పంపిణీ చేసిన తర్వాత, సీఎం చంద్రబాబు స్వయంగా ఒక లబ్ధిదారుల ఇంట్లో టీ తయారు చేశారు, ఇది వీడియో రూపంలో వైరల్ అయింది. శ్రీకాకుళం జిల్లా ఈదుపురం గ్రామంలో “దీపం – 2.0” కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, శాంతమ్మ అనే లబ్ధిదారురి ఇంట్లో చంద్రబాబు గ్యాస్ స్టౌ వెలిగించి, పాల ప్యాకెట్ కోసి, చాయ్ తయారు చేశారు. “నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు” అని నవ్వుతూ చంద్రబాబు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు , పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

లబ్ధిదారులతో మాట్లాడిన అనంతరం, ఒకటో తేదీ కావడంతో పింఛన్‌దారులకు రూ.4,000 పింఛన్‌ని చంద్రబాబు అందించారు. ఈదుపురంలోని జానకికి సీఎం వెంటనే రూ.4,000 అందజేశారు , ఆమె కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇల్లు అందుబాటులో లేకపోవడంతో, ఆమెకు తక్షణమే ఇల్లు కట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీలలో భాగంగా, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున లబ్ధిదారులకు అందించనున్నామని తెలిపారు. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల వ్యవధిలో, లబ్ధిదారులు ఖర్చు చేసిన మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయబడుతుంది.

ఈ సందర్భంగా ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుందని, మేం మొన్న కేబినెట్‌ లో దీనిపై చర్చించామని, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారని, దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన అన్నారు. ఆయన మృతితో ఉద్యమం పుడితే తరువాత అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ప్రకటించారని, 1956లో ఆంధ్ర రాష్ట్రం , తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు సీఎం చంద్రబాబు. 2014లో జూన్ 2 ఆంధ్ర ప్రదేశ్ విడిపోయింది. ఇవన్నీ మొన్న క్యాబినెట్ లో చర్చించామని, ఒక్కో రోజున ఒక్కో పరిణామం జరిగిందన్నారు చంద్రబాబు. అయితే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన రోజును ప్రత్యేక రోజుగా గుర్తించి నిర్వహించేందుకు మేం నిర్ణయం తీసుకున్నామని, పొట్టి శ్రీరాములు చనిపోయిన డిశంబర్ 15 తేదీ చరిత్రలో ముఖ్యమైన రోజు అని ఆయన అన్నారు. ఆయన ప్రాణ త్యాగం చేసిన రోజును, ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఆయనను గౌరవించుకుంటామని చంద్రబాబు అన్నారు. ఏపీ విషయంలో చరిత్రలో అనేక మార్పులు జరిగాయని, అయితే చరిత్ర గుర్తుపెట్టుకుంటూనే చరిత్ర సృష్టించిన త్యాగధనులను గౌరవిస్తామన్నారు.ఈ విషయంలో ఎప్పుడూ ముందు ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also : Gambling Disorder : గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటే ఏమిటి..? లక్షల మంది ప్రజలు దాని బారిన పడుతున్నారని అధ్యయనం వెల్లడి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • bapatla
  • chandrababu naidu
  • Deepam scheme
  • diwali
  • education
  • Free Gas Cylinders
  • pension distribution
  • political promises
  • potti sriramulu
  • public welfare

Related News

Festivals In 2026

ఈ ఏడాది పండుగల తేదీలు..

Festivals in 2026  నూతన సంవత్సరం 2026 ఆగమనానికి సమయం ఆసన్నమైంది. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి ఇప్పటికే అందరూ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హిందూ పంచాంగం ప్రకారం అధిక మాసం ఎప్పుడొచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పండుగలైన సంక్రాంతి 2026, హోలీ 2026, మహాశివరాత్రి 2026, ఉగాది 2026, వినాయక చవితి 2026, రంజాన్‌ 2026, దసరా నవరాత్రి 2026, దీపావళి 2026 తేదీలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నూతన సంవత్సరం 2026 జనవరి 1వ [

  • Key decision of the Inter Board..Hall tickets will now be sent directly to parents' phones..

    ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..ఇక నేరుగా తల్లిదండ్రుల ఫోన్లకే హాల్‌టికెట్లు..

Latest News

  • పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!

  • మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

  • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి

  • అమెరికా నౌకలను ముంచేస్తాం.. రష్యా ఎంపీ హెచ్చరికలు

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd