HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >This Victory Is Dedicated To India Captain Suryakumar Yadav

ఈ విజయం భారత్‌ కు అంకితం..కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

  • Author : Vamsi Chowdary Korata Date : 16-02-2026 - 8:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suryakumar Yadav
Suryakumar Yadav

Suryakumar Yadav : టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 77 పరుగులతో హీరోగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని దేశానికి అంకితం చేశాడు. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ కుప్పకూలింది. ఈ గెలుపుతో భారత్ సూపర్ – 8 దశకు మరింత దగ్గరైంది. పాయింట్ల పట్టికలో యూఎస్ఏ రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడో స్థానానికి వెళ్లింది.

  • విజయం మొత్తం భారత్‌కే అంకితం
  • ఇషాన్ కిషన్ ఆట తీరు అద్భుతం
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వన్ సైడ్ విక్టరీ సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన ఆటగాడు ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టును గెలుపు బాట పట్టించాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య ఈ విజయాన్ని భారతదేశానికి అంకితం చేశాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఇషాన్ మాట్లాడుతూ “ఆరంభంలో పిచ్ కాస్త కష్టంగా అనిపించింది. కానీ నా బలాలపై నమ్మకం పెట్టుకుని ఆడాను. ఆఫ్‌సైడ్‌పై చాలా కష్టపడ్డాను. 160–170 పరుగులు చేస్తే సరిపోతుందని అనుకున్నాను. భారత్–పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ స్పెషల్” అని తెలిపాడు.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇషాన్ ప్రదర్శనను ప్రశంసించాడు. “ఈ విజయం మొత్తం భారత్‌కే అంకితం. తొలి వికెట్ త్వరగా పడిపోయాక బాధ్యత తీసుకున్న విధానం అద్భుతం. ఇషాన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాడు. 175 పరుగులు ఈ పిచ్‌పై చాలా మంచి స్కోరు” అని సూర్య పేర్కొన్నాడు. అలాగే బౌలింగ్ విభాగం కూడా సమష్టిగా రాణించిందని సూర్య తెలిపారు. “అందరూ కలిసి పోరాడారు. ఇదే మన బలమని మరోసారి నిరూపించాం. జట్టుగా కలిసి ఆనందించి, తర్వాతి మ్యాచ్‌లపై దృష్టి పెడతాం” అని అన్నాడు.

మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తమ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. “మన స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఎగ్జిక్యూషన్ లోపించింది. బ్యాటింగ్‌లో పవర్‌ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోయాం. ఇలాంటి మ్యాచ్‌ల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నియంత్రించుకోవాలి. ఇప్పుడు మా ముందున్న మ్యాచ్ గెలవాల్సిందే. అప్పుడు మాత్రమే సూపర్-8 అవకాశాలు ఉంటాయి” అని చెప్పాడు.

ఈ గెలుపుతో భారత్ టోర్నీలో మరింత బలంగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ సమతూకం చూపిస్తూ, ప్రత్యర్థులకు స్పష్టమైన హెచ్చరిక పంపింది. ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత జట్టు సూపర్ 8 బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • cricket news India
  • ICC Cricket News
  • ICC T20 world cup
  • ICC T20 World Cup 2026
  • ind vs pak
  • IND vs PAK Match
  • Indian cricket news
  • sports news
  • Sports UpdatesCricket News
  • Suryakumar Yadav
  • Suryakumar Yadav (SKY)
  • T20 World Cup 2026
  • team india
  • Telugu Cricket News
  • Telugu Sports News

Related News

Women's T20 World Cup: Pakistan routed by India again.

Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ చేతిలో మళ్లీ చిత్తైన పాకిస్థాన్..

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత జట్టు తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, ఆల్ రౌండర్ దీప్తి శర్

  • Brother... it's no joke! Vaibhav Suryavanshi has shattered records right from the start.

    Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు

Latest News

  • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd