Orange Cap In IPL: ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలవని స్టార్ బ్యాటర్లు!
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్‌లో స్టార్స్‌గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు.
- By Gopichand Published Date - 02:00 PM, Sat - 14 December 24

Orange Cap In IPL: ఐపీఎల్ ధనాధన్ లీగ్ (Orange Cap In IPL) కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేలం ప్రక్రియ ముగిసింది. సాధారణంగానే ఈ లీగ్‌లో బ్యాట్స్‌మెన్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ లీగ్లో బౌలర్లు సైతం బౌన్దరీలు బాదుతుంటారు. మరి బాటర్లు ఇంకెంత రెచ్చిపోతారో తెలిసిందే. కాగా ఐపీఎల్ లో ప్రభావం చూపించిన ఆటగాళ్లను క్యాప్ లతో సత్కరిస్తారు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు ఆరెంజ్ క్యాప్ ప్రధానం చేస్తారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు పర్పుల్ క్యాప్ లభిస్తుంది.
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్‌లో స్టార్స్‌గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు. ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. కానీ రోహిత్ ఐపీఎల్ లో ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. రోహిత్ శర్మ 257 ఐపీఎల్ మ్యాచ్‌లలో 131.14 స్ట్రైక్ రేట్‌తో 6628 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు మరియు 43 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో ధోనీ కూడా ఉండటం విశేషం. ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌గా ఎన్నో మ్యాచ్ లను గెలిపించాడు. అయితే మాహీ ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. ధోనీ 264 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 137.54 స్ట్రైక్ రేట్‌తో 5243 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 24 అర్ధ సెంచరీలు సాధించాడు.
Also Read: AP Irrigation Election: నేడు ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు.. ఎన్నికలను బహిష్కరించిన వైకాపా పార్టీ?
మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రైనా తన ఐపీఎల్ కెరీర్‌ను ముగించాడు. రైనా ప్లేఆఫ్‌లు మరియు ఫైనల్స్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కానీ సురేష్ రైనా కూడా ఒక్క ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. రైనా 205 ఐపీఎల్ మ్యాచ్‌లలో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.